e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 20, 2021
Home News ఆక్సిజ‌న్ కావాలా.. నాతో శృంగారం చేయ్..

ఆక్సిజ‌న్ కావాలా.. నాతో శృంగారం చేయ్..

ఆక్సిజ‌న్ కావాలా.. నాతో శృంగారం చేయ్..

న్యూఢిల్లీ : క‌రోనా మ‌హ‌మ్మారి నాగుపాములా కోర‌లు చాచి బుస‌లు కొడుతుంటే.. ఆక్సిజ‌న్ లేక ప్రాణాలు కోల్పోతున్న వైనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అండ‌గా నిల‌వాల్సిన కొంద‌రు మృగాళ్ల మారుతున్నారు. నాన్న చావు, బ‌తుకుల మ‌ధ్య‌లో ఉన్నాడు.. ఆక్సిజ‌న్ కావాలి అని వ‌రుస‌కు సోద‌రుడైన ఓ వ్య‌క్తిని యువ‌తి అడ‌గ్గా.. ఆమెకు చేదు అనుభ‌వం ఎదురైంది. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ కావాలంటే.. త‌న‌తో శృంగారం చేయాల‌ని డిమాండ్ చేశాడు.

ఈ విష‌యాన్ని ఓ యువ‌తి త‌న ట్విట్ట‌ర్ పేజీలో షేర్ చేసింది. నా స్నేహితుడి చెల్లి తండ్రికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. దీంతో ఆయ‌న తీవ్ర అస్వ‌స్థ‌కు గుర‌య్యాడు. ఆక్సిజ‌న్ అవ‌స‌రం ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ సాయం చేయాల‌ని పొరుగింటి వ్య‌క్తిని(వ‌రుస‌కు సోద‌రుడు) ఆమె అడిగింది. అందుకు అత‌ను స్పందిస్తూ త‌న‌తో శృంగారం చేస్తే ఆక్సిజ‌న్ స‌మ‌కూర్చుతాన‌ని చెప్పాడు. అత‌ని మాట‌లు విన్న ఆమె షాక్‌కు గురైంది అని తెలుపుతూ ట్వీట్‌లో పేర్కొంది.

అయితే ఈ ఘ‌ట‌న‌పై ప‌లువురు నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అత‌నిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేయంటి అంటూ నెటిజ‌న్లు సూచించారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆక్సిజ‌న్ కావాలా.. నాతో శృంగారం చేయ్..

ట్రెండింగ్‌

Advertisement