స్త్రీలలో వక్షోజ క్యాన్సర్ రాకుండా ‘సెల్ఫ్ ఎగ్జామినేషన్’ ప్రక్రియ ఉంది కదా! అలాగే పురుషుల్లో వృషణాల క్యాన్సర్, కణతులు ముందుగానే పసిగట్టాలంటే ఏవైనా ప్రక్రియలు ఉన్నాయా తెలియజేయండి?
– ఓ సోదరుడు, వరంగల్
‘టెస్ట్క్యులర్ సెల్ఫ్ ఎగ్జామినేషన్’ ద్వారా ప్రతి నెలా పురుషులు స్వయంగా వృషణాలను పరీక్షించుకోవచ్చు. దీనివల్ల క్యాన్సర్ కణుతులు, వేరికోసీల్ వెయిన్స్ లేదా వరిబీజాలు, పోలీప్స్ బయటపడతాయి. దీనివల్ల వృషణాల్లో క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే.. అంటే గ్రేడ్-1లోనే గుర్తించవచ్చు.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, రైస్ హాస్పిటల్, హస్తినాపురం,
హైదరాబాద్. ఫోన్: 9849770409
ఈ మెయిల్: bharathid506@gmail.com