పన్నా: సుమారు 40 లక్షలు ఖరీదైన వజ్రాన్ని(Diamond) ఓ గిరిజన కార్మికుడు గుర్తించాడు. మధ్యప్రదేశ్లోని పన్నా జిల్లాలో ఉన్న గనిలో ఆ డైమెండ్ అతనికి కనిపించింది. కృష్ణ కల్యాణ పట్టిలో ఉన్న ఓ గనిలో మాధవ్ అనే కార్మికుడు పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సుమారు 11.95 క్యారెట్ల ఖరీదైన రాయిని అతను గుర్తించినట్లు జిల్లా అధికారి తెలిపారు. ఆ డైమెండ్ చాలా క్లీన్గా ఉందని, ఖరీదైందని, దాని విలువ సుమారు 40 లక్షలు ఉంటుందని పన్నా డైమెండ్ ఆఫీసు అధికారి రవి పటేల్ తెలిపారు. అయితే రూల్స్ ప్రకారం పన్నా డైమండ్ ఆఫీసులో ఆ ఖరీదైన రాయిని కార్మికుడు డిపాజిట్ చేసినట్లు చెప్పారు. త్వరలో ఆ వజ్రాన్ని వేలం వేయనున్నారు. 12.5 శాతం రాయాల్టీ తీసి వేసిన తర్వాత కార్మికుడికి మిగితా డబ్బును ఇస్తారు. మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో పన్నా జిల్లా ఉంది. ఇక్కడ 12 లక్షల క్యారెట్ల వజ్ర నిక్షేపాలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.