కొండచరియలు విరిగిపడటంతో పట్టాలు తప్పిన రైలు

పనాజీ: భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో ఒక రైలు పట్టాలు తప్పింది. గోవాలో ఈ ఘటన జరిగింది. కర్నాటకలోని మంగళూరు నుంచి ముంబై సీఎస్టీకి వెళ్లే స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను వర్షాల కారణంగా శుక్రవారం దారి మళ్లించారు. మడగాన్-లోండా-మిరాజ్ మార్గంలో ప్రయాణించిన ఈ రైలు గోవాలోని దూద్‌సాగర్-సొనౌలిమ్ సెక్షన్లో ట్రాక్‌పై పడిన కొండచరియలను ఢీకొట్టింది. దీంతో రైలు ఇంజిన్, వెనుక ఉన్న జనరల్ బోగి పట్టాలు తప్పాయి. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.
మరోవైపు పట్టాలు తప్పిన జనరల్ బోగిని విడదీసి అందులోని ప్రయాణికులను ఇతర కోచ్‌లలో ఎక్కించారు. అనంతరం రైలును వెనక్కి మళ్లించి కులేం రైల్వే స్టేషన్‌కు చేర్చారు. ఈ ఘటనతోపాటు రైలు పట్టాలపై కొండచరియలు పడిన నేపథ్యంలో ఆ మార్గంలో ప్రయాణించే కొన్ని రైళ్లను పాక్షికంగా, మరి కొన్ని రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

