Home
National
Traffic Police On The Front Mirror Of The Car The Man Who Drove 10 Kilometers In Maharashtra
Traffic police | కారు అద్దంపై పది కిలోమీటర్లు.. ట్రాఫిక్ పోలీసును ఈడ్చుకెళ్లిన వాహనదారుడు
కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పది కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడో వ్యక్తి. మహారాష్ట్రలోని వాశిలో ఈ సంఘటన జరిగింది. ఓ కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్తుండటాన్ని గమనించిన సిద్దేశ్వర్ మాలి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు.
ముంబై: కారును ఆపేందుకు ప్రయత్నించిన ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఢీకొట్టి పది కిలోమీటర్ల వరకు ఈడ్చుకెళ్లాడో వ్యక్తి. మహారాష్ట్రలోని వాశిలో ఈ సంఘటన జరిగింది. ఓ కారు రోడ్డుపై అడ్డదిడ్డంగా వెళ్తుండటాన్ని గమనించిన సిద్దేశ్వర్ మాలి అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ దాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. దీంతో కారు నడుపుతున్న ఆదిత్య ఆపకుండా మరింత వేగంతో దూసుకుపోయాడు. దీంతో కానిస్టేబుల్ తన బైక్‌పై కారును వెంబడించి సమీప క్రాస్ రోడ్డులో ఆపేందుకు ప్రయత్నించగా అతడిని ఢీకొట్టడంతో కారు అద్దంపై పడిపోయాడు.
అయినా కారును ఆపకుండా అలాగే పది కిలోమీటర్లు వెళ్లాడు ఆదిత్య. దీంతో పోలీసులు మరో వాహనంలో వెంబడించి కారును ఆపి కానిస్టేబుల్‌ను కాపాడారు. ఆదిత్య ఈ సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

