Bharat Bandh | రేపు, ఎల్లుండి భారత్ బంద్.. బ్యాంకింగ్ సేవలకు అంతరాయం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29 తేదీల్లో కార్మిక సంఘాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. ఇటీవల కేంద్ర కార్మిక సంఘాల వేదిక ఉమ్మడి సమావేశం నిర్వహించింది. కార్మిక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక, దేశ వ్యతిరేక విధానాలకు రెండు రోజుల పాటు సమ్మెకు వెళ్లాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. రవాణా, విద్యుత్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ సహా పలు రంగాలకు చెందిన కార్మికులు సమ్మెలో భాగం కానున్నారు.
ప్రైవేటీకరణ, ఇంధన ధరల పెంపు, ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.5శాతం నుంచి 8.1 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ కార్మిక సంఘాలు 48 గంటల బంద్‌కు నిర్ణయించాయి. కేంద్ర నిర్ణయాలతో సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయా సంఘాలు మండిపడుతున్నాయి. దేశవ్యాప్త సమ్మెలో బ్యాంకింగ్ రంగం పాల్గొంటుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ క్రమంలో 28, 29 తేదీల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశవ్యాప్త సమ్మెలో పాల్గొననున్నాయి.
ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించే ప్రభుత్వ యోచనతో పాటు బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2021కి నిరసనగా బ్యాంకు యూనియన్లు సమ్మెలో పాల్గొననున్నాయి. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టే దేశవ్యాప్త సమ్మెలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ , బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పాల్గొంటున్నట్లు చెప్పాయి. ఆయా యాజమాన్యాలకు ఇప్పటికే ఆ సంఘాలు నోటీసులు అందజేశాయి.
అయితే, కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేసినప్పటికీ.. సమ్మె కారణంగా బ్యాంకుల్లో పరిమిత స్థాయిలో సేవలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటన విడుదల చేసింది. సమ్మెలో ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీ పాల్గొనబోతున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: టాస్ గెలిచిన ఇండియా.. న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్
Ranabaali | మిక్స్డ్ టాక్‌ను తట్టుకుని దూసుకుపోతున్న ‘రణబాలి’.. బ్రేక్ఈవెన్ దిశగా అడుగులు!
Vice President | ఏపీలో 26,27వ తేదీల్లో ఉప రాష్ట్రపతి పర్యటన
RS Praveen Kumar | మేడిగడ్డపై ఫిర్యాదు చేసి మూడేండ్లు గడిచినా పట్టించుకోవడం లేదు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

