Venkaiah Naidu : పునరుజ్జీవం దిశగా ఈశాన్య భారతం: వెంకయ్యనాయుడు
Venkaiah Naidu : ఏడేండ్లుగా ఈశాన్య భారతంలో వస్తున్న మార్పులు ఈ ప్రాంతం భవిష్యత్‌లో సాధించే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ...

ఈటానగర్ : (Venkaiah Naidu) ఏడేండ్లుగా ఈశాన్య భారతంలో వస్తున్న మార్పులు ఈ ప్రాంతం భవిష్యత్‌లో సాధించే మరిన్ని విజయాలకు బాటలు వేస్తున్నాయని ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. గతంలో ఈ ప్రాంతం ఎదుర్కొన్న ప్రతికూల పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నదన్నారు. ఈశాన్య భారతం పునరుజ్జీవనం దిశగా అడుగులు వేస్తున్నదని, ఈ ప్రాంతాభివృద్ధిలో నవశకం ప్రారంభమైందని ఆయన పేర్కొన్నారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.
చట్టసభల పనితీరును పరిస్థితుల్లో మార్పు రావాలని, ప్రజల సమస్యలను ప్రస్తావించి, చర్చించి వాటికి పరిష్కారం సూచించేలా చట్టసభలు ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు. 2015-20 మధ్యకాలంలో అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ కనిష్టంగా ఒకరోజు, గరిష్టంగా 6 రోజులపాటు సమావేశమైన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ధోరణి ఆందోళనకరమన్నారు. ఈశాన్య భారతంలోని రాష్ట్రాలన్నీ తమ సమావేశాల సమయాన్ని కాస్త పొడిగించుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. మొత్తం 498 మంది శాసనసభ్యుల్లో 4 శాతం మాత్రమే మహిళలుండటం సరికాదని, చట్టాల రూపకల్పనలో మహిళలకు సరైన ప్రాతినిధ్యాన్ని కల్పించాలని చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ ని తీసుకొచ్చే వరకూ ఈ ప్రాంతంలో ఆకాంక్షలకు, వాటిని పూర్తిచేయడానికి మధ్య స్పష్టమైన అంతరం ఉండేదని వెంకయ్యనాయుడు అన్నారు. మానవాభివృద్ధి సూచీ-2019 ప్రకారం, ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాలు జాతీయ సగటుకంటే మంచి స్థానంలో నిలిచిందని చెప్పారు. శాసనసభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం.. అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ప్రాంగణంలో నెలకొల్పిన గ్రంథాలయాన్ని, డోర్జీ ఖండూ సమావేశ ప్రాంగణాన్ని ఉపరాష్ట్రపతి జాతికి అంకింత చేశారు. అనంతరం ప్రాంగణంలో కాగితం రీసైక్లింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ స్పీకర్ ప్రసాంగ్ దోర్, ముఖ్యమంత్రి పెమా ఖండూ, విపక్షనేతతోపాటు అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ప్రీపోల్ సర్వేలను నిషేధించాలి : మాయావతి
మాకు ‘మియా’ ఓట్లు వద్దే వద్దు : హిమంత బిశ్వ శర్మ
ఔను! నేను ‘చరస్’ తీసుకున్నా.. పంచనామాలో ఆర్యన్ ఖాన్ నేరాంగీకారం
బొలీవియా అడవుల్లో చే గువేరా దారుణహత్య
జాన్వీ కపూర్ మణికట్టుపై టాటూ.. ఎవరీ లబ్బూ?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manne Krishank | ఒకటి కాదు మూడు ఆధారాలు చూపిస్తా.. మెడికవర్ ఆసుపత్రి షేర్లపై రేవంత్‌రెడ్డికి క్రిశాంక్ సవాల్!
Punjagutta Temple: పంజాగుట్ట దుర్గాభవానీ గుడిలో సరస్వతీ దేవి అలంకారములో అమ్మవారు
Hyderabad | పీవీ ఎక్స్‌ప్రెస్‌వేపై యాక్సిడెంట్.. ఒకదానికొకటి ఆరు కార్లు ఢీ
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

