Mayawati : ప్రీపోల్ సర్వేలను నిషేధించాలి : మాయావతి
Mayawati : ప్రీపోల్ సర్వేలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కుమారి మాయావతి డిమాండ్ చేశారు. మీడియా సంస్థల...

లక్నో: (Mayawati) ప్రీపోల్ సర్వేలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కుమారి మాయావతి డిమాండ్ చేశారు. మీడియా సంస్థల సర్వేలు, ఇతర ఏజెన్సీల సర్వేలను ఎన్నికలకు ఆరు నెలల ముందు నిషేధించాలని, దీని వల్ల ఎన్నికలు ప్రభావితం కాకుండా ఉంటాయని ఆమె అన్నారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు లేఖ రాస్తానని మాయావతి చెప్పారు. బీఎస్పీ వ్యవస్థాపకుడు కాన్షీరాం 15 వ వర్ధంతి కాన్షీరాం స్మారక్ స్థల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో మాయావతి మాట్లాడుతూ, దివంగత దళిత నాయకుడు కాన్షీరాంకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అధికారం మార్పుపై ఉత్తర ప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అయితే సర్వేల పేరుతో ప్రజలను ప్రభావితం చేసేలా చూస్తున్నారని మాయావతి పేర్కొన్నారు. రాబోయే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకుని మరోసారి అధికారంలోకి వస్తుందని ఏబీపీ-సీ వోటర్ సర్వేలో తేలింది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీకి 15-19 సీట్లు మాత్రమే లభిస్తాయని సర్వేలో వెల్లడించారు. ఈ సర్వే తమకు అనుకూలంగా లేకపోవడంతో మాయావతి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, యూపీ ప్రభుత్వాలు వాతావరణాన్ని తమకు అనుకూలంగా మలచుకోవడానికి రాష్ట్ర యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నాయని ఆమె ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ పార్టీ వెనకబడిపోతున్నదని సర్వేల్లో చెప్పగా.. ఎలాంటి ఫలితం వచ్చిందో అందరికీ తెలుసునన్నారు. ఎన్నికల్లో గెలువడం అనేది కొన్ని చిన్నాచితకా పార్టీల పని కాదని, అధికార పక్షానికి తెర వెనుక నుంచి ప్రయోజనం కల్పించే సొంత స్వార్ధంతో ఉన్నాయని మాయావతి.. పార్టీల పేరు ఎత్తకుండా దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి..
మాకు ‘మియా’ ఓట్లు వద్దే వద్దు : హిమంత బిశ్వ శర్మ
ఔను! నేను ‘చరస్’ తీసుకున్నా.. పంచనామాలో ఆర్యన్ ఖాన్ నేరాంగీకారం
బొలీవియా అడవుల్లో చే గువేరా దారుణహత్య
జాన్వీ కపూర్ మణికట్టుపై టాటూ.. ఎవరీ లబ్బూ?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

