Boy Steals Mother’s Gold To Gift iPhone To Girl | స్నేహితురాలికి ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు.. తల్లి బంగారాన్ని దొంగిలించిన బాలుడు
Boy Steals Mother's Gold To Gift iPhone To Girl | స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఒక బాలుడు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తల్లి బంగారాన్ని దొంగిలించాడు. స్వర్ణకారులకు విక్రయించిన డబ్బుతో ఐఫోన్ కొన్నాడు. తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు.
న్యూఢిల్లీ: స్నేహితురాలి పుట్టిన రోజు సందర్భంగా ఐఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చేందుకు ఒక బాలుడు ఏకంగా తన ఇంటికి కన్నం వేశాడు. 9వ తరగతి చదువుతున్న ఆ బాలుడు తల్లి బంగారాన్ని దొంగిలించాడు. (Boy Steals Mother’s Gold To Gift iPhone To Girl ) స్వర్ణకారులకు విక్రయించిన డబ్బుతో ఐఫోన్ కొన్నాడు. తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు జరిపిన పోలీసులు చివరకు నిందితుడైన ఆ బాలుడ్ని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నజాఫ్‌గఢ్ ప్రాంతంలో తల్లితో కలిసి నివసిస్తున్న బాలుడు ప్రైవేట్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాడు. క్లాస్మేట్ అయిన స్నేహితురాలి పుట్టిన రోజున సప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలని భావించాడు. దీని కోసం తల్లిని డబ్బు అడిగాడు. నిరాకరించిన ఆమె చదువుపై దృష్టిపెట్టాలని కొడుకును మందలించింది.
కాగా, ఆగస్ట్ 2న ఆ మహిళ ఇంట్లో చోరీ జరిగింది. ఆమెకు చెందిన రెండు బంగారు గొలుసులు, ఒక జత బంగారు చెవిపోగులు, ఒక బంగారు ఉంగరం మాయమయ్యాయి. ఆ మరునాడు పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన తర్వాత బయట నుంచి ఎవరూ చోరీకి పాల్పడలేదని గ్రహించారు. తండ్రి మరణించడంతో తల్లితోపాటు ఉంటున్న కుమారుడిపై అనుమానం వ్యక్తం చేశారు. చోరీ తర్వాత నుంచి అతడు కనిపించడంకపోవడంతో స్కూల్లోని ఫ్రెండ్స్‌ను ఆరా తీశారు.
మరోవైపు ఆగస్ట్ 6న ఆ బాలుడు తన ఇంటికి వస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడ మాటు వేసిన పోలీసులు ఆ బాలుడ్ని గుర్తించారు. పోలీసులను పసిగట్టి పారిపోయేందుకు ప్రయత్నించిన అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ బాలుడ్ని ప్రశ్నించగా తల్లి బంగారాన్ని తానే చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. ఇద్దరు స్వర్ణకారులకు విక్రయించినట్లు తెలిపాడు. రూ.50,000 ఖరీదైన ఐఫోన్ కొని పుట్టిన రోజున స్నేహితురాలికి గిఫ్ట్‌గా ఇచ్చినట్లు చెప్పాడు. దీంతో కమల్ వర్మ అనే 40 ఏళ్ల స్వర్ణకారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గోల్డ్ రింగ్, బంగారం చెవిపోగులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

