shadow cabinet | బీజేపీకి చెక్ పెట్టేందుకు నవీన్ ‘షాడో క్యాబినెట్’.. దేశంలోనే తొలిసారి
shadow cabinet | ఒడిశాను 25 ఏళ్లు పాలించిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టడంతోపాటు జవాబుదారీని చేసేందుకు ‘షాడో క్యాబినెట్’ ఏర్పాటు చేశారు. 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు పలు శాఖలు కేటాయించారు.
భువనేశ్వర్: ఒడిశాను 25 ఏళ్లు పాలించిన మాజీ సీఎం నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఆ రాష్ట్రంలో తొలిసారి ఏర్పడిన సీఎం మోహన్ మాంఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టడంతోపాటు జవాబుదారీని చేసేందుకు ‘షాడో క్యాబినెట్’ ఏర్పాటు చేశారు. (shadow cabinet ) 50 మంది బీజేడీ ఎమ్మెల్యేలకు పలు శాఖలు కేటాయించారు. మాజీ ఆర్థిక మంత్రి ప్రసన్న ఆచార్యకు ఆర్థిక శాఖ పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. పరిపాలన, ప్రజా ఫిర్యాదులను ప్రతాప్ దేబ్ పర్యవేక్షిస్తారు. మాజీ మంత్రి నిరంజన్ పూజారి గృహ, ఆహారం, వినియోగదారుల సంక్షేమ శాఖలను పర్యవేక్షిస్తారు. షాడో మంత్రివర్గానికి సంబంధించిన ఒక ఉత్తర్వును ఆ పార్టీ జారీ చేసింది.
కాగా, నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేసిన ఈ షాడో క్యాబినెట్ ప్రభుత్వ అధికారిక సంస్థ కాదు. అలాగే ఎలాంటి అధికారాలు ఉండవు. జూలై 22 నుంచి ఒడిశా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యలో ప్రభుత్వంలోని ఆయా శాఖల నిర్ణయాలు, విధానాలను నిశితంగా పరిశీలించే బాధ్యతను ఈ షాడో మంత్రివర్గానికి అప్పగించారు. దీంతో అసెంబ్లీలో చర్చ సమయంలో ఆయా శాఖలను పర్యవేక్షించే బీజేడీ ఎమ్మెల్యేలు సంబంధిత మంత్రులను ఎదుర్కొంటారు. తద్వారా సీఎం మోహన్ మాఝీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి చెక్ పెట్టనున్నారు.
మరోవైపు ఒక రాష్ట్రంలో ‘షాడో క్యాబినెట్’ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, బ్రిటన్‌లో ప్రతిపక్ష పార్టీలకు ‘షాడో క్యాబినెట్’ మాదిరి సంస్థాగత వ్యవస్థలు ఉన్నాయి. కెనడాలో షాడో మంత్రి పదవులు కలిగిన వారిని ‘ప్రతిపక్ష విమర్శకుడు’గా వ్యవహరిస్తారు.
ఇక బ్రిటన్‌లోని షాడో క్యాబినెట్లో ఎక్కువ మంది సీనియర్ ప్రతిపక్ష సభ్యులు ఉంటారు. ప్రతి ఒక మంత్రికి ఒక షాడోను నియమిస్తారు. ఆ మంత్రి పనితీరు, అభివృద్ధి విధానాలను వారు అధ్యయనం చేస్తారు. ఆ మంత్రులు తీసుకునే నిర్ణయాలు, చర్యలకు వారిని బాధ్యులుగా చేస్తారు.
ବିରୋଧୀ ଦଳ ହେଉଛି ଜନସାଧାରଣଙ୍କ ସ୍ୱାର୍ଥର ଜାଗ୍ରତ ପ୍ରହରୀ। ବିଜୁ ଜନତା ଦଳ ବିରୋଧୀ ଦଳ ଭାବେ ରାଜ୍ୟ ସରକାରଙ୍କ ବିଭିନ୍ନ ବିଭାଗର କାର୍ଯ୍ୟ କଳାପ ଉପରେ ତୀକ୍ଷ୍ଣ ନଜର ରଖିବ। ଏଥିପାଇଁ ବିରୋଧୀ ଦଳ ନେତା ଶ୍ରୀ @Naveen_Odisha ବିଜୁ ଜନତା ଦଳର ୫୦ ଜଣ ନିର୍ବାଚିତ ସଦସ୍ୟଙ୍କୁ ନିମ୍ନ ସୂଚୀ ଅନୁଯାୟୀ ଦାୟିତ୍ୱ ପ୍ରଦାନ କରିଛନ୍ତି।… pic.twitter.com/uCnpIuxMj7
— Biju Janata Dal (@bjd_odisha) July 17, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

