No Confidence Motion | మణిపూర్ మండుతుంటే విదేశీ పర్యటనలో మోదీ బిజీ : టీఎంసీ
పార్లమెంట్లో మంగళవారం అవిశ్వాస తీర్మానంపై (No Confidence Motion) చర్చ సందర్భంగా మోదీ సర్కార్‌పై విపక్షం విరుచుకుపడింది. మణిపూర్ అల్లర్లతో అట్టుడుకుతుంటే ప్రధాని విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్లారని టీఎంసీ నిలదీసింది.
న్యూఢిల్లీ : పార్లమెంట్లో మంగళవారం అవిశ్వాస తీర్మానంపై (No Confidence Motion) చర్చ సందర్భంగా మోదీ సర్కార్‌పై విపక్షం విరుచుకుపడింది. మణిపూర్ అల్లర్లతో అట్టుడుకుతుంటే ప్రధాని విదేశీ పర్యటనకు ఎందుకు వెళ్లారని టీఎంసీ నిలదీసింది. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మాట్లాడుతూ తాను బీబీసీ డాక్యుమెంటరీ, గుజరాత్ అల్లర్ల గురించి మాట్లాడబోనని, బెంగాల్ ఎన్నికల్లో ఓటమి తర్వాత తమ రాష్ట్రానికి కేంద్రం నిధులను నిలిపివేసిందని దుయ్యబట్టారు.
మోదీ ప్రభుత్వం మానవీయ కోణంలో వ్యవహరించడం లేదని దుయ్యబట్టారు. బెంగాల్‌కు కేంద్రం పలుమార్లు ప్రతినిధి బృందాలను పంపిందని, కానీ మణిపూర్‌కు ఒక్క ప్రతినిధి బృందాన్నీ పంపలేదని ఆరోపించారు. భారత్‌ను ప్రేమించేవారెవరైనా మోదీని ద్వేషిస్తారన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మణిపూర్ ఘటనలను మాటమాత్రంగానూ ప్రస్తావించలేదని అన్నారు. డీఎంకే ఎంపీ టీఆర్ బాలు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తన స్నేహితుడని అభివర్ణిస్తూ మణిపూర్ భగ్గుమంటుంటే ప్రధాని మోదీ ఎక్కడున్నారని నిలదీశారు.
పార్లమెంట్‌కు రావాలని ప్రజలు మోదీని ఎన్నుకుంటే సభకు వచ్చేందుకు ఆయనకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు. మణిపూర్‌లో శాంతిభద్రతల పరిస్ధితి దిగజారితే ఐరోపా, బ్రిటిష్ పార్లమెంట్లు ఆందోళన వ్యక్తం చేసినా మోదీ సర్కార్ మౌనం దాల్చిందని అన్నారు. మణిపూర్ అల్లర్లలో ఏకంగా 163 మంది మరణిస్తే ప్రధాని నోరుమెదపలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నెలకొన్న పరిస్ధితి తరహాలోనే మణిపూర్‌లోనూ మెజారిటీ వర్సెస్ మైనారిటీ అన్నట్టుగా పరిస్ధితులు నెలకొన్నాయని డీఎంకే ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.
Read More :
Imran Khan: ఇమ్రాన్ ఖాన్ జైలు గదిలో నల్లులు.. పాక్ మాజీ ప్రధానికి సీ క్లాస్ సదుపాయాలు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Foreign Tour
- Manipur
- PM
- TMC
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
మహేశ్ కుమార్ గౌడ్, పొంగులేటి, గడ్డం వంశీకృష్ణకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Abhilasha Godishala | రాజకీయ దురుద్దేశంతో ‘వెలుగు’ దినపత్రిక కథనం : బీఆర్ఎస్ ఎన్నారై కువైట్ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల
France Riots: పారిస్‌లో 350 మందికిపైగా అరెస్టు.. అల్లర్లను నియంత్రించలేకపోయామన్న మంత్రి
Golden Chariot | స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా ఊరేగిన మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

