Mankameshwar Temple: తిరుపతి లడ్డూ వివాదం.. ఆ ఆలయంలో ప్రసాదాలపై నిషేధం
Mankameshwar temple: లక్నోలోని మంకామేశ్వర్ ఆలయం కీలక ప్రకటన చేసింది. భక్తులు బయటి నుంచి తీసుకువచ్చే ప్రసాదాలపై నిషేధం విధిస్తూ ఆ ఆలయం నిర్ణయం తీసుకున్నది. తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో ఆ నిర్ణయం తీసుకున్నట్లు మహంతి గిరి తెలిపారు.
లక్నో: తిరుపతి శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రస్తుత వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని మంకామేశ్వర్ ఆలయం(Mankameshwar temple) కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తులు బయటి నుంచి తీసుకువచ్చే ప్రసాదాలపై నిషేధం విధిస్తూ ఆ ఆలయం నిర్ణయం తీసుకున్నది. కేవలం ఇంట్లో తయారు చేసిన ప్రసాదాలను కానీ, పండ్లను మాత్రమే ఆలయంలో నైవేద్యంగా సమర్పించాలని మంకామేశ్వర్ ఆలయ మహంతి దేవ్య గిరి తెలిపారు. తిరుపతిలో కలుషిత ప్రసాదాన్ని సరఫరా చేయడం క్షమించరాని నేరమని మహంతి పేర్కొన్నారు.
తిరుపతి ప్రసాదంలో జంతువుల నెయ్యి కలిసిన నేపథ్యంలో.. భక్తులు తాము తీసుకువచ్చే ప్రసాదాలను మాంసాహార పదార్ధాలతో తయారీ చేయరాదు అని ఆమె తెలిపారు. ఇంట్లో తయారు చేసిన నెయ్యి లేదా డ్రై ఫ్రూట్స్ లేదా పండ్లను తీసుకురావాలని గిరి వెల్లడించారు. దేవునికి సమర్పించే ప్రసాదాల్లో జంతు పదార్ధాలను వాడడం సనాతన ధర్మంపై దాడి చేయడమే అని, తిరుమలలో ఆ నేరానికి పాల్పడిన వ్యక్తలకు మరణశిక్ష విధించాలని మహంతి గిరి అభిప్రాయపడ్డారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

