TTD | నేటి నుంచి నెల రోజులపాటు శ్రీవారి పుష్కరిని బంద్.. ఎందుకంటే?
తిరుమలలో (Tirumala) శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని (Pushkarini) నేటి నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నామని, ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని టీటీడీ (TTD) తెలిపింది.
తిరుమల: తిరుమలలో (Tirumala) శ్రీవారి ఆలయం వద్ద గల పుష్కరిణిని (Pushkarini) నేటి నుంచి నెలరోజుల పాటు మూసివేయనున్నారు. పుష్కరిణిలో ఉన్న నీటిని తొలగించి పైపులైన్ల మరమ్మతులు, సివిల్ పనులు చేపట్టనున్నామని, ఇందులో భాగంగా ఆగస్టు 1 నుంచి 31వ తేదీ వరకు పుష్కరిణిని మూసివేస్తున్నామని టీటీడీ (TTD) తెలిపింది. ఈ నెల రోజులపాటు పుష్కరిణికి హారతి ఉండదని అధికారులు చెప్పారు. సాధారణంగా స్వామి పుష్కరిణిలో నీరు నిల్వ ఉండే అవకాశం లేదని, పుష్కరిణిలోని నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగించేందుకు అత్యుత్తమ రీసైక్లింగ్ వ్యవస్థ అందుబాటులో ఉందన్నారు. నిరంతరాయంగా కొంత శాతం చొప్పున నీటిని శుద్ధి చేసి తిరిగి వినియోగిస్తామని తెలిపారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా నెల రోజుల పాటు పుష్కరిణిలో నీటిని తొలగించి చిన్న చిన్న మరమ్మతులను పూర్తి చేస్తామని వెల్లడించారు. మరమ్మతులు పూర్తి చేసి చివరి పది రోజులు పుష్కరిణిలో నీటిని నింపి పూర్తిగా సిద్ధం చేయనున్నామని పేర్కొన్నారు.
రెండుసార్లు స్వామివారి బ్రహ్మోత్సవాలు
కాగా, తిరుమలలో ఈసారి బ్రహ్మోత్సవాలకు చాలా విశిష్టత ఉన్నదని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. ఈసారి అధిక మాసం సందర్భంగా వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సెప్టెంబర్ 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలుగా, అక్టోబర్ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలుగా నిర్వహిస్తామని వివరించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందన్నారు. బ్రహ్మోత్సవాల వేళ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయనున్నట్టు తెలిపారు. స్వయంగా వచ్చే ప్రముఖులకే బ్రేక్ దర్శనం కల్పిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

