Watch: చెరకు పొలంలో పులి సంచారం.. వీడియో వైరల్
Tiger Spotted Roaming | చెరకు పొలంలో ఒక పులి సంచరించింది. ( Tiger Spotted Roaming) ఒక వాహనంలో వెళ్తున్న వ్యక్తి దీనిని రికార్డ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: చెరకు పొలంలో ఒక పులి సంచరించింది. ( Tiger Spotted Roaming) ఒక వాహనంలో వెళ్తున్న వ్యక్తి దీనిని రికార్డ్ చేశాడు. ఈ నేపథ్యంలో ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కుక్రా ప్రాంతంలోని చెరకు పొలాల్లో పులులు స్వేచ్చగా సంచరిస్తుంటాయి. ఈ నేపథ్యంలో రాత్రి వేళ కారులో వెళ్తున్న వ్యక్తికి ఒక పులి కనిపించింది. దీంతో అతడు తన కారును వెనక్కి నడిపాడు. అలాగే కారు లోపల నుంచి వీడియో తీశాడు.
కాగా, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) అధికారి రమేష్ పాండే ఈ వీడియో క్లిప్‌ను ఎక్స్‌లో షేర్ చేశారు. ‘ వేటాడే జంతువులు, ఇతర జంతువులకు చెరకు పొలాలు అనువైన ఆవాసాలు. ముఖ్యంగా శీతాకాలంలో టెరాయ్ ప్రాంతంలో సంచరించే వన్యప్రాణులు మనుషులకు ఎక్కువగా తారసపడతాయి’ అని అందులో పేర్కొన్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
यूपी के तराई में पड़ने वाले लखीमपुर खीरी जिले में टाइगर्स कुछ ऐसे गन्ने के खेतों में मस्ती भरी चाल से घूमते हैं। वीडियो कुकरा इलाके की बताई जा रही। #Canetigers@rameshpandeyifs @DudhwaTR @raju2179 pic.twitter.com/ewhdJvbcPJ
— Prashant pandey (@prashant_lmp) September 30, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

