Tiger Chasing Man | పులితోనే ఆటలా!.. వెన్నులో వణుకు పుట్టిస్తున్న వైరల్ వీడియో
Tiger Chasing Man : పెంపుడు జంతువుల(Pet Animals)తో ఆడుకోవడం, వాటితో వీడియోలు చేయడం చాలామందికి సరదా. అలాంటి వీడియోలకు ఆన్లైన్లో మస్త్ వ్యూస్ వచ్చిపడతాయి. అయితే.. కొందరు మాత్రం బడాయికి పోయి పులులు, సింహాలతో వీడియోలు...
Tiger Chasing Man : పెంపుడు జంతువుల(Pet Animals)తో ఆడుకోవడం, వాటితో వీడియోలు చేయడం చాలామందికి సరదా. అలాంటి వీడియోలకు ఆన్లైన్లో మస్త్ వ్యూస్ వచ్చిపడతాయి. అందుకని కొందరు తాము పెంచుకొనే కుక్కలు(Dogs), పిల్లులు(Cats), పక్షులతో ఫన్నీ వీడియోలు పోస్ట్ చేస్తుంటారు. అయితే.. కొందరు మాత్రం బడాయికి పోయి పులులు, సింహాలతో వీడియోలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాల బారిన పడుతుంటారు కూడా. తాజాగా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న పులి వీడియో కూడా అలాంటిందే.
ఒక పెద్ద బంగ్లాలో ఒక పులి ఒక వ్యక్తిని వెంటాడుతుంది. ఆ పక్కనే మరో వ్యక్తి వీడియో తీస్తున్నాడు. మొదట్లో ఆ వ్యక్తి నవ్వుతూ కనిపించినా ఆ తర్వాత భయపడ్డాడు. పరుగెత్తే క్రమంలో అదుపుతప్పి కింద పడిపోయాడు. అయినా సరే ఆ పులి అతడిని వదలలేదు. అయితే.. అది ఒక పెంపుడు పులి కావడంతో అతడు బతికి బట్టకట్టాడు. వెన్నులో వణుకుపుట్టించే ఈ వీడియోను ఎవరో ‘బిలియనీర్స్ లైఫ్ స్టయిల్’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో పెట్టారు.
ఈ వైరల్ వీడియో దుబాయ్‌లో తీసినట్టు తెలుస్తోంది. అక్కడ పులులు, సింహాలను పెంపుడు జంతువులుగా పెంచుకోవడాన్ని స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. అంతేకాదు అప్పుడప్పుడు తమ పెట్ టైగర్స్, లయన్స్‌తో వీధుల్లో తిరుగుతుంటారు కూడా. వీడియో చూసిన వాళ్లంతా.. పులిని దూరంగా చూడాలనుకో తప్పులేదు. కానీ పులితోనే ఫొటో దిగాలనుకున్నావో వేటాడేస్తది అని యమదొంగ సినిమాలోని జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి
- Fighter Trailer | హృతిక్ రోషన్ స్పిరిట్ ఆఫ్ ఫైటర్ ట్రైలర్ వచ్చేసింది..
- Makarajyothi | నేడు మకరజ్యోతి దర్శనం.. శబరి గిరులకు భారీగా భక్తులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

