Encounter | ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో (Sukma) పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు (Maoist) మరణించారు.
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో (Sukma) పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు (Maoist) మరణించారు. చింతగుఫా పోలీస్ స్టేషన్ పరిధిలోని కరిగుండం అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, గాలింపు బృందాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
ఇప్పటివరకు ముగ్గురు మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తున్నది. ఆపరేషన్ ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.
2026 నాటికి దేశంలో మావోయిస్టు అనే పేరు వినపడకుండా చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను చేపట్టింది. ఇందులో భాగంగా చర్చలకు తావేలేదని తేల్చిచెప్పిన కేంద్రం.. మావోయిస్టులను వరుస ఎన్కౌంటర్లలో ఏరిపారేస్తున్నది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల మావోయిస్టు పార్టీ అగ్ర నేతలు సహా భారీగా క్యాడర్ ఆయుధాలతో సహా లొంగిపోయారు. కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు ఛత్తీస్‌గఢ్‌లో 262 మంది మావోయిస్టులు వివిధ ఎన్కౌంటర్లలో మృతిచెందారు. వారిలో 233 మంది ఒక్క బస్తర్ డివిజన్లో మరణించారు. మరో 27 మంది రాయ్‌పూర్ డివిజన్లోని గరియాబంద్ జిల్లాలో, ఇద్దరు దుర్గ్ డివిజన్లో చనిపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

