Blast in house | ఇంట్లో భారీ పేలుడు.. ముగ్గురు మృతి.. ఏడుగురికి గాయాలు
Blast in house | ఇంట్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి ఇల్లు ద్వంసమైంది. ఇంట్లోని ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. హర్యానా రాష్ట్రం సోనెపట్ జిల్లా ఖార్ఖోడా తాలూకాలోని రిదౌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Blast in house : ఇంట్లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఆ పేలుడు ధాటికి ఇల్లు ద్వంసమైంది. ఇంట్లోని ముగ్గురు సజీవ దహనమయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. హర్యానా రాష్ట్రం సోనెపట్ జిల్లా ఖార్ఖోడా తాలూకాలోని రిదౌ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇంట్లో పేలుడు సంభవించినట్లుగా తమకు సమాచారం వచ్చిందని, వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారని సోనెపట్ ఏసీపీ జీత్ సింగ్ చెప్పారు. పేలుడు సంభవించిన ఇంట్లో పటాకుల తయారీకి ఉపయోగించే పేలుడు పదార్థాలను గుర్తించినట్లు తెలిపారు.
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి చెందిన బృందం పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకుందని ఏసీపీ చెప్పారు. ఆ ఇంటి నుంచి మూడు మృతదేహాలను బయటికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏడుగురిని ఆస్పత్రికి తరలించామని, వారికి చికిత్స కొనసాగుతున్నదని వెల్లడించారు.
#WATCH | Sonipat, Haryana: 3 killed and 7 injured in an explosion in a house in Ridhau village of Kharkhoda
Sonipat ACP Jeet Singh says, “Information was regarding a blast in a house and we have found material used in firecrackers from the spot.Some people said a cylinder… pic.twitter.com/j6olCoJNCc
— ANI (@ANI) September 28, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

