ఫేమస్ ఐఫోన్ రింగ్‌టోన్ ఏంటో తెలుసు కదా. ఎక్కువ మంది ఐఫోన్ యూజర్ల ఫోన్లలో ఇదే రింగ్‌టోన్ ఉంటుంది. ఇదే రింగ్‌టోన్‌ను ఓ రామ చిలుక ఇమిటేట్ చేసింది. ఆ చిలుక పేరు గుస్సీ. అది ఐఫోన్ రింగ్ టోన్ ను ఇమిటేట్ చేస్తుంటే.. అచ్చం ఐఫోన్ నుంచే సౌండ్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సాధారణంగా చిలుకలు మాట్లాడుతాయని తెలుసు కానీ.. ఇలా రింగ్టోన్లను కూడా ఇమిటేట్ చేస్తాయా.. అని నోరెళ్లబెట్టాల్సి వస్తుంది ఈ వీడియో చూస్తే. వావ్.. ఎంత క్యూట్‌గా ఇమిటేట్ చేస్తుందో.. అంటూ నెటిజన్లు ఆ చిలుకను చూసి ముచ్చటపడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేసేయండి.