‘వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనప్పుడు రైతులతో చర్చలెందుకు?’

న్యూఢిల్లీ: మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోబోమని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం, రైతులతో చర్చలు జరుపుతామని అనడంలో ఏమైనా అర్థం ఉన్నదా? అని శిరోమణి అకాలీదళ్‌కు చెందిన హర్సిమ్రత్ కౌర్ బాదల్ విమర్శించారు. రైతులకు మద్దతుగా పార్లమెంట్ ఆవరణలో గురువారం ఆమె నిరసన తెలిపారు. ‘దేశానికి తిండి పెడుతున్న రైతులను చంపవద్దు. నల్ల చట్టాలను వెనక్కి తీసుకోండి’ అన్న ఫ్ల కార్డును ప్రదర్శించారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు గత 8 నెలలుగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో నిరసన చేస్తున్నారని హర్సిమ్రత్ కౌర్ తెలిపారు. నిరసనలో పాల్గొన్న రైతుల్లో 500 మందికిపైగా చనిపోయారని చెప్పారు. అయినప్పటికీ రైతుల పరిస్థితిని ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆమె విమర్శించారు.
తమ సమస్యలను పార్లమెంట్లో ప్రస్తావించేందుకు రైతు ప్రతినిధులను అనుమతించడంలేదని కౌర్ ఆరోపించారు. రైతులతో చర్చలు జరుపుతామంటున్న కేంద్ర వ్యవసాయ మంత్రి, ఆ దిశగా చొరవ చూపడం లేదని ఆమె విమర్శించారు. రైతుల కోసం శిరోమణి అకాలీదళ్ పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

