21 ఏండ్లదాక ఆపితే ఆడపిల్లలు తిరుగుబోతులవుతారట..!: కేంద్రమంత్రి నఖ్వీ
Mukhtar Abbas Naqvi: మహిళల కనీస వివాహ వయసును 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి.

న్యూఢిల్లీ: మహిళల కనీస వివాహ వయసును 18 ఏండ్ల నుంచి 21 ఏండ్లకు పెంచాలన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసినప్పటి నుంచి అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. ఎదిగిన ఆడపిల్లకు త్వరగా పెండ్లి చేయడానికే తల్లిదండ్రులు మొగ్గుచూపుతారని, అలా చేస్తే తప్పేంటని సమాజ్వాది పార్టీ సీనియర్ ఎంపీ షఫీకుర్ రహమాన్ బర్క్ ప్రశ్నించారు.
బాలికలు 18 ఏండ్లు రాగానే ఓటు వేయొచ్చుగానీ పెండ్లి చేసుకోగూడదా..? అని ఎస్పీకే చెందిన మరో ఎంపీ ఎస్టీ హసన్ ప్రశ్నించారు. బాలికలు 18 ఏండ్లకు ప్రధానిని ఎన్నుకోగలరుగానీ, జీవిత భాగస్వామిని ఎన్నుకోలేరా..? అని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్న లేవనెత్తారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. మహిళల వివాహ వయసు పెంపుపై కొందరు చేస్తున్న కామెంట్లు విచిత్రంగా ఉన్నాయన్నారు.
21 ఏండ్లు వచ్చేవరకు పెండ్లి చేయకుండా ఆపితే ఆడపిల్లలు తిరుగుబోతులు అవుతారని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారని, వాళ్ల వ్యాఖ్యలు తనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తున్నాయని నఖ్వీ చెప్పారు. పెండ్లి ఆలస్యమైతే ఆడపిల్లలు తిరుగుబోతులు ఎందుకవుతారని ఆయన ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలను పట్టించుకోవద్దన్నారు. వాళ్లది హిందుస్థానీ మనస్తత్వం కాదని, తాలిబనీ మనస్తత్వమని వ్యాఖ్యానించారు. అయితే, ఆ వివాదాస్పద వ్యాఖ్యలు ఎవరు చేశారనేది మాత్రం మంత్రి వెల్లడించలేదు.
#WATCH | Delhi: Union Minister of Minority Affairs, Mukhtar Abbas Naqvi says, "…Some statements surprise me. They say girls will turn rogue if married off at the age of 21. Why will they turn rogue? Don't you trust them? Such mindset can only be 'Talibani', not 'Hindustani'…" pic.twitter.com/21SDrCZLkL
— ANI (@ANI) December 18, 2021
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

