న్యూఢిల్లీ: కింగ్ ఆఫ్ డైనోసార్స్గా పేరుగాంచిన థెరోపాడ్ డైనోసార్ జాతికి చెందిన అతిపెద్ద తైరన్నోసారస్ రెక్స్(టీ.రెక్స్) బరువు 15 వేల కిలోలు ఉండేదని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇది లండన్ డబుల్ డెక్కర్ బస్సు బరువు కంటే ఎక్కువని, గతంలో అనుకొన్న దానికంటే 70 శాతం అధికమని కెనడాలో ఒట్టావాలోని కెనడియన్ మ్యూజియం ఆఫ్ నేచర్ పరిశోధకులు తెలిపారు. ఈ మేరకు టీ.రెక్స్ డైనోసార్ల సాధారణ పెరుగుదలను అంచనా వేసే నమూనాను రూపొందించారు.