Home
National
The Supreme Court On Directed The Up Govt To Reconstitute The Sit In The Ayodhya Donation Theft Case
సిట్‌ను పునర్ వ్యవస్థీకరించండి.. అయోధ్య కేసులో సుప్రీంకోర్ట్
అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్‌ను పునర్వ్యస్థీకరించాలని సుప్రీం కోర్ట్ సోమవారం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, దాన్ని తార్కిక ముగింపునకు తీసుకెళ్లాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నొక్కి చెప్పింది.
న్యూఢిల్లీ: అయోధ్య విరాళాల చోరీ కేసులో సిట్‌ను పునర్వ్యస్థీకరించాలని సుప్రీం కోర్ట్ సోమవారం యూపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలని, దాన్ని తార్కిక ముగింపునకు తీసుకెళ్లాలని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం నొక్కి చెప్పింది. ఈ తరహా కేసుల్లో అనుభవమున్న సీనియర్ ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేకంగా దర్యాప్తు కోసం మాత్రమే సిట్‌ను ఏర్పాటు చేస్తే బాగుంటుందని తాము భావిస్తున్నట్టు కోర్టు తెలిపింది.
‘ఒక హెచ్చరిక. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దు. కోర్టులు రాజకీయాలకు వేదిక కాదు. ఇది కేవలం ఒక నేరం జరిగిన కేసు. సరైన దర్యాప్తు జరిగేలా చూసేందుకే మేం ఇక్కడ ఉన్నాం’ అని సీజేఐ అన్నారు. ఈ నెల 27న తదుపరి విచారణ చేపడతామని.. అప్పుడు స్టేటస్ రిపోర్ట్‌ను పరీక్షించి తగిన ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

