ED | ఈడీ ఏందిది?.. 5 వేల కేసుల్లో రుజువైనవి 40 కేసులేనా?.. సుప్రీంకోర్టు ఆగ్రహం
ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) చట్టం కింద గత పదేండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు 5 వేల కేసులు నమోదుచేస్తే, నేరారోపణలు రుజువైన కేసులు 40 కూడా లేవని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
- దర్యాప్తు మెరుగు పడాల్సిన అవసరం ఎంతో ఉన్నది
- మౌఖిక సాక్ష్యాలు కాదు.. శాస్త్రీయ ఆధారాలు కావాలి
- ఈడీ కేసుల దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
ED | హైదరాబాద్, ఆగస్టు 7 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) చట్టం కింద గత పదేండ్లలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాదాపు 5 వేల కేసులు నమోదుచేస్తే, నేరారోపణలు రుజువైన కేసులు 40 కూడా లేవని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈడీ దర్యాప్తు ప్రక్రియను మెరుగుపర్చాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా నొక్కి చెప్పింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ వ్యాపారి కేసును బుధవారం విచారించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈడీ పనితీరుపై కీలక వ్యాఖ్యలు చేసింది.
ధర్మాసనం ఏమన్నదంటే?
‘పీఎంఎల్ఏ చట్టం కింద గడిచిన పదేండ్లలో 5 వేలకు పైగా కేసులను ఈడీ నమోదు చేసినట్టు కేంద్రం పార్లమెంట్లో వెల్లడించింది. అయితే, ఇందులో కేవలం 40 కేసుల్లో మాత్రమే నేరారోపణలు రుజువైనట్టు పేర్కొంది. ఇదెలాంటి పరిస్థితి అనేది మీరే (ఈడీ) ఊహించుకోండి. మీ దర్యాప్తు ప్రక్రియను మెరుగుపర్చుకోవాల్సిన అవసరాన్ని ఈ గణాంకాలే చెప్తున్నాయి. కేసు నమోదుచేయడమే కాదు.. కోర్టులో దాన్ని నిరూపించడానికి తగిన శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించాలి. ఇక, ఈ కేసు విషయానికి వస్తే, సాక్ష్యులుగా కొందరిని చూపిస్తున్నారే గానీ, శాస్త్రీయ పరమైన ఆధారాలను కోర్టుకు సమర్పించట్లేదు. అందుకే శాస్త్రీయ పరమైన ఆధారాలను ఇవ్వాలని కోరుకొంటున్నాం’ అని ధర్మాసనం పేర్కొంది.
పార్లమెంట్లో కేంద్రం ఏం చెప్పిందంటే?
2014 నుంచి ఇప్పటివరకూ పీఎంఎల్ఏ చట్టం కింద ఈడీ.. 5,297 కేసులను నమోదు చేయగా, ఇందులో 40 కేసుల్లో నేరారోపణలు రుజువయ్యాయని, మిగతా మూడు కేసులు వీగిపోయాయని కేంద్రం పార్లమెంట్‌కు వెల్లడించింది., కాగా ఈడీ కేసులపై ప్రతిపక్షాలు గతకొన్నేండ్లుగా తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈడీ నమోదు చేసిన కేసుల్లో నేరారోపణలు రుజువైన కేసులు వేళ్లమీద లెక్కపెట్టవచ్చన్న అభిప్రాయాలూ ఉన్నాయి. కేంద్రం విడుదల చేసిన లెక్కలు ఈ విమర్శలను బలపరుస్తుండటం గమనార్హం.
పదేండ్లలో పీఎంఎల్ఏ కింద ఈడీ నమోదు చేసిన కేసుల వివరాలు

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | సినిమాల విషయంలో రూటు మార్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ఇకపై వరుస సినిమాలతో బిజీ బిజీ!
India-US trade deal | భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం.. కీలక అంశాలు..!
Terrorist Arrested | ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాది అరెస్ట్.. ఏకే-47 స్వాధీనం
ఇందిరమ్మ బీమా నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ అంకిత్
Abhijeet Dipke | ‘నేను ఇక్కడే ఉన్నా, నన్ను అరెస్ట్ చేయండి’.. లుకౌట్ నోటీస్‌పై అభిజిత్ దిప్కే
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

