గురువారం 21 జనవరి 2021
National - Jan 01, 2021 , 12:50:41

సూర్యుడు ఇప్పుడే ఉద‌యించాడు.. క‌విత రాసిన ప్ర‌ధాని మోదీ

సూర్యుడు ఇప్పుడే ఉద‌యించాడు.. క‌విత రాసిన ప్ర‌ధాని మోదీ

హైద‌రాబాద్‌: ఆస్మాన్ మే స‌ర్ ఉటాక‌ర్‌.. ఘ‌నే బాద‌లోంకో చీర్  క‌ర్‌.. రోషినీ కా సంక‌ల్ప్ లే.. అబీ తో సూర‌జ్ ఉగా హై..  ఇదీ ప్ర‌ధాని మోదీ రాసిన క‌విత‌.  2021 కొత్త సంవ‌త్స‌రం సంద‌ర్భంగా ఆయ‌న ఈ క‌విత‌ను రాసిన‌ట్లు తెలుస్తోంది.  మై గ‌వ‌ర్న‌మెంట్ ఇండియా ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ క‌విత‌తో రూపొందించిన వీడియోను పోస్టు చేశారు. వినీల ఆకాశంలో త‌ల ఎత్తుకుని ఉండాల‌ని.. ద‌ట్ట‌మైన మేఘాల‌ను చీల్చుకుని.. వెలుగు లాంటి సంక‌ల్పంతో ముంద‌కు సాగాల‌ని.. ఇప్పుడే సూర్యుడు ఉద‌యించాడ‌న్న అంశాన్ని ప్ర‌ధాని మోదీ త‌న క‌విత‌లో తెలిపారు.  మోదీయే స్వ‌యంగా ఆ క‌విత‌ను చ‌దివారు.  తాను ఇటీవ‌ల గురుద్వారా విజిట్ చేసిన ఫోటోల‌ను కూడా ఆ వీడియోలో పోస్టు చేశారు.  క‌రోనా మ‌హ‌మ్మారి వేళ ప్ర‌ధాని మోదీ చేప‌ట్టిన ప‌ర్య‌ట‌న‌ల‌తో పాటు సైనికులు, మెడిక‌ల్ సిబ్బంది, రైతుల‌తో ఆ వీడియోను రూపొందించారు.ఈ కొత్త సంవ‌త్స‌రాన్ని ఈ ప్రేర‌ణాత్మ‌క క‌వితతో ప్రారంభిద్దామ‌ని ఆ ట్వీట్‌లో తెలిపారు.  కొత్త ఏడాది సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆరోగ్యం, సంతోషం, స‌మృద్ధి క‌ల‌గాల‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు.  logo