NEET | నీట్ పరీక్షలో అక్రమార్కులు నిజమే!.. దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాల ఆందోళనలు
నీట్ పరీక్షలో అక్రమాలపై ఒకవైపు ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు నెట్ పరీక్షను రద్దు చేయడం పట్ల విద్యార్థిలోకం భగ్గుమన్నది.
- భగ్గుమన్న విద్యార్థిలోకం
- నీట్ పరీక్షకు ముందురోజే మాకు ప్రశ్నపత్రం అందింది
- రాత్రంతా జవాబులు బట్టీ పట్టాం: అరెస్టయిన విద్యార్థులు
- దేశంలో ‘ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ’.. విపక్షాల ఆగ్రహం
- నీట్ రద్దు, కేంద్రమంత్రి రిజైన్‌కు విద్యార్థుల డిమాండ్
- కౌన్సెలింగ్‌ను ఆపబోము: సుప్రీంకోర్టు స్పష్టీకరణ
- ఎన్టీఏపై సమీక్షకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ
నీట్ అక్రమాలు తవ్వినకొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. ‘పరీక్షకు ముందురోజు మాకు పేపర్ అందింది. రాత్రంతా బట్టీ పట్టాం’ అని అరెస్టయిన విద్యార్థులు వెల్లడించారు. 40లక్షలకు పేపర్ కొన్నామని కొందరంటే, తమ బంధువులు తెచ్చి ఇచ్చారంటూ మరికొందరు చెప్పారు. పేపర్ రిగ్గింగ్ మాఫియా దేశాన్ని నడిపిస్తున్నదని విపక్షాలు మండిపడ్డాయి. నీట్‌ను రద్దుచేయడంతోపాటు, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు గురువారం దేశవ్యాప్తంగా ఆందోళనకు దిగారు.
NEET | న్యూఢిల్లీ, జూన్ 20: నీట్ పరీక్షలో అక్రమాలపై ఒకవైపు ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు నెట్ పరీక్షను రద్దు చేయడం పట్ల విద్యార్థిలోకం భగ్గుమన్నది. గురువారం ఉదయం ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఏ, ఎన్ఎస్యూఐ, డీఎస్ఎఫ్, కేవైఎస్ తదితర సంఘాల ఆధ్వర్యంలో ఢిల్లీలోని విద్యాశాఖ కార్యాలయం, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, నెట్ పరీక్షలో అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని పట్టుబట్టారు. పరీక్షల్లో అవకతవకతలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పలువురు విద్యార్థుల అరెస్టు
ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. పేపర్ లీక్ అయ్యిందనే ఆరోపణల నేపథ్యంలో ఎన్టీఏను నిషేధించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అనేక అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలనే తమ డిమాండ్‌పై ఎన్టీఏ, విద్యాశాఖ స్పందించలేదని, ఇప్పుడు నెట్ పరీక్ష కూడా లీక్ కారణంగా రద్దు అయ్యిందన్నారు. ఎన్టీఏ మరోసారి విద్యార్థుల సమయాన్ని వృథా చేసిందని, ఈ సంస్థను పూర్తిగా రద్దు చేయాలని ఏఐఎస్ఏ డిమాండ్ చేసింది. ఆందోళన చేస్తున్న మహిళా విద్యార్థులపై పోలీసులు తీవ్రంగా దాడి చేశారని ఎస్ఎఫ్ఐ ఆరోపించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

