The Emergency Diaries: ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా మోదీ పోరాటం.. బుక్ ప్రచురించిన బ్లూక్రాఫ్ట్ ఫౌండేషన్
The Emergency Diaries: ద ఎమర్జెన్సీ డైయిరీస్.. ఇయర్స్ దట్ ఫోర్జ్డ్ ఏ లీడర్ అన్న టైటిల్‌తో మోదీపై బుక్‌ను రాశారు. ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా పోరాటం చేసిన మోదీ అనుభవాలను ఆ బుక్‌లో పబ్లిష్ చేశారు. బ్లూక్రాఫ్ట్ ఫౌండేషన్ ఆ బుక్‌ను ప్రింట్ చేసింది.
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ అనుభవాలకు చెందిన జ్ఞాపకాలతో కూడిన పుస్తకాన్ని బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సంస్థ ప్రింట్ చేసింది. ఎమర్జెన్సీ నాటి రోజుల్లో ఆర్ఎస్ఎస్ ప్రచారక్‌గా మోదీ ఎలా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారో ఆ బుక్‌లో రాశారు. మోదీ స్వయంగా వెల్లడించిన ఎమర్జెన్సీ అనుభవాలను ఆ బుక్‌లో ప్రజెంట్ చేశారు. ద ఎమర్జెన్సీ డైయిరీస్.. ఇయర్స్ దట్ ఫోర్జ్డ్ ఏ లీడర్(The Emergency Diaries) అన్న టైటిల్‌తో బుక్‌ను డిజైన్ చేశారు. ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా మోదీ అనుభవాలను ఆ బుక్‌లో రాశారు. యువ మోదీతో పనిచేసిన మరికొందరు అనుభవాలను కూడా ఆ బుక్‌లో పబ్లిష్ చేశారు. ప్రజాస్వామ్య విలువల కోసం మోదీ ఎలా ఫైట్ చేశారో ఆ బుక్‌లో ప్రజెంట్ఛేసినట్లు చెబుతున్నారు. ఆ పుస్తకానికి మాజీ ప్రధాని హెచ్డీ దేవగౌడ ముందుమాట రాశారు. దేవగౌడ కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ద ఎమర్జెన్సీ డైయిరీస్ పుస్తకాన్ని ఇవాళ కేంద్ర మంత్రి అమిత్ షా రిలీజ్ చేస్తారు.
When the Emergency was imposed, I was a young RSS Pracharak. The anti-Emergency movement was a learning experience for me. It reaffirmed the vitality of preserving our democratic framework. At the same time, I got to learn so much from people across the political spectrum. I am… https://t.co/nLY4Vb30Pu
— Narendra Modi (@narendramodi) June 25, 2025
బుక్ రిలీజ్ గురించి ప్రధాని మోదీ తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేశారు. ఎమర్జెన్సీ విధించిన రోజుల్లో తాను ఆర్ఎస్ఎస్ ప్రచారకుడిగా ఉన్నట్లు చెప్పారు. యాంటీ ఎమర్జెన్సీ ఉద్యమం తనకు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని ఎలా కాపాడాలో ఆ ఉద్యమం నేర్పిందన్నారు. ఆ నాటి కొన్ని అనుభవాలను బ్లూక్రాఫ్ట్ డిజిటల్ సంస్థ క్రోడీకరించి ఓ బుక్ రూపంలో తీసుకువచ్చిందన్నారు. ఎమర్జెన్సీ రోజులను గుర్తు తెచ్చుకునేవాళ్లు తమ అనుభవాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవాలని మోదీ పిలుపునిచ్చారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

