Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా లిమిటెడ్ (వోఐఎల్)కు చెందిన చమురు నిల్వల వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒక కార్మికుడు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గువాహటి: ఆయిల్ ఇండియా లిమిటెడ్ (వోఐఎల్)కు చెందిన చమురు నిల్వల వద్ద భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఒక కార్మికుడు మరణించగా పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. (Fire At Oil India Tank Farm) అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. టెంగాఖత్లోని ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంస్థకు చెందిన ఇంటర్మీడియట్ ట్యాంక్ ఫార్మ్ (ఐటీఎఫ్)లో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఉదయం 9.30 గంటల సమయంలో కార్మికులు ఒక వాల్వ్‌ను ఆపరేట్ చేస్తుండగా ట్యాంక్ ఫార్మ్‌లోని ముడి చమురు నిల్వ విభాగంలో పేలుడు సంభవించింది. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. భయాందోళన చెందిన కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు.
కాగా, ఈ అగ్నిప్రమాదంలో ఒక కార్మికుడు మరణించగా మరో ఆరుగురికి కాలిన గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం దిబ్రూగఢ్‌లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, వోఐఎల్కు చెందిన ఆసుపత్రికి తరలించినట్లు ఆ కంపెనీ తెలిపింది. గాయపడిన కార్మికులు ఆయిల్ ఇండియా లిమిటెడ్ నియమించిన ముంబైకి చెందిన స్పెక్ట్రాన్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉద్యోగులని పేర్కొంది.
మరోవైపు ఈ పేలుడుకు దారితీసిన కచ్చితమైన పరిస్థితులను అధికారికంగా ఇంకా ధృవీకరించలేదని ఆయిల్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. తమ అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపుచేసినట్లు పేర్కొంది. మృతుల కుటుంబానికి సానుభూతిని ఆ సంస్థ తెలియజేసింది. అయితే ఈ అగ్నిప్రమాదంలో మరికొంత మంది కూడా గాయపడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Assam
- Dead
- Fire accident
- Injured
RELATED ARTICLES
తాజా వార్తలు
Palakurthi Congress Leaders | ఝాన్సీ రెడ్డికి పీసీసీ ఉపాధ్యక్ష పదవి ఇవ్వడం పట్ల కాంగ్రెస్ నాయకుల్లో అసంతృప్తి
Fire At Oil India Tank Farm | ఆయిల్ ఇండియా సంస్థ చమురు నిల్వల వద్ద అగ్నిప్రమాదం.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
Peptides | అమెరికా ఆరోగ్య రంగంలో కీలకమార్పు.. పెప్టైడ్ల వినియోగానికి గ్రీన్ సిగ్నల్.. ఏంటివి.. ఎలా పనిచేస్తాయి..?
Illegal Arrest | బీఆర్ఎస్ నాయకుడు బాలరాజు యాదవ్ అక్రమ అరెస్ట్
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

