OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
OPPO Smart Phone | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) మరో సంచలన ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
OPPO Smart Phone | స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ముఖ్యం. ఫోన్లో ఎన్ని ఫీచర్లు ఉన్నా.. బ్యాటరీ ఎక్కువసేపు రాకపోతే ఇబ్బందులు తప్పవు. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో (Oppo) మరో సంచలన ఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే 10,000mAh బ్యాటరీతో ఫోన్‌ను తీసుకొచ్చిన ఒప్పో.. ఇప్పుడు అంతకుమించిన బ్యాటరీ సామర్థ్యంతో మరో ఫోన్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం.
XpertPick నివేదిక ప్రకారం.. ఒప్పోకు చెందిన ఒక స్మార్ట్‌ఫోన్ చైనాలోని MIIT సర్టిఫికేషన్ డేటాబేస్‌లో కనిపించింది. PNC110 మోడల్ నంబర్‌తో ఈ ఫోన్ లిస్టింగ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో 11,640mAh రేటెడ్ కెపాసిటీ కలిగిన బ్యాటరీ ఉన్నట్లు సమాచారం. దీని సాధారణ (Typical) బ్యాటరీ సామర్థ్యం 12,000mAhగా ఉండవచ్చని నివేదిక పేర్కొంది. అయితే ఈ ఫోన్‌కు సంబంధించిన మార్కెటింగ్ పేరు, ధర, లాంచ్ తేదీ, పూర్తి స్పెసిఫికేషన్లను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. లిస్టింగ్ ప్రకారం 5G కనెక్టివిటీకి కూడా మద్దతు ఉండే అవకాశం ఉంది.
ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్‌కు మించి బ్యాటరీ
ప్రస్తుతం ఒప్పో అందించిన స్మార్ట్ఫోన్లలో A7 Pro Max మోడల్ 10,000mAh బ్యాటరీతో ముందంజలో ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్లలో ఈ ఫోన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర 599 యూరోలు (సుమారు రూ.61,000)గా ఉంది. 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయాన్ని అందించింది. కొత్త PNC110 ఫోన్ 12,000mAh బ్యాటరీతో వస్తే.. A7 Pro Max రికార్డును అధిగమించనుంది.
త్వరలోనే మరిన్ని వివరాలు?
ప్రస్తుతం PNC110 మోడల్‌కు సంబంధించిన బ్యాటరీ సామర్థ్యం, 5G కనెక్టివిటీ వివరాలు మాత్రమే నివేదికల్లో వెల్లడయ్యాయి. ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ఏ పేరుతో మార్కెట్లోకి వస్తుంది? ధర ఎంత ఉంటుంది? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. దీనిపై ఒప్పో అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్ ఫీచర్లు ఇవే..
ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 330Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు మద్దతు ఇస్తుంది. HDR బ్రైట్నెస్ మోడ్‌లో గరిష్ఠంగా 1,800 నిట్స్ బ్రైట్నెస్ అందిస్తుంది. ఈ ఫోన్లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 Gen 5 ప్రాసెసర్, అడ్రినో 629 GPU ఉన్నాయి. 8GB వరకు LPDDR4x ర్యామ్, 256GB వరకు UFS 3.1 స్టోరేజ్ సదుపాయం కల్పించారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో OIS సపోర్ట్‌తో కూడిన 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP మ్యాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 50MP కెమెరా అందించారు. దీనికి 100 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూ సపోర్ట్ ఉంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
OPPO Smart Phone | ఒప్పో నుంచి బ్యాటరీ బాంబ్.. ఏకంగా 12,000mAh బ్యాటరీతో కొత్త 5G ఫోన్!
Supreme Court: 3 రాష్ట్రాల మధ్య 60 ఏళ్లుగా విద్యుత్తు వివాదం.. పరిష్కరించిన సుప్రీంకోర్టు
Mahesh Babu | ‘రామాయణ’పై మహేష్ బాబు ప్రశంసలు.. ‘వారణాసి’లో శ్రీరాముడిగా ఎలా కనిపిస్తారోనని చర్చ..!
Athulya Chandra | డాక్టర్‌ను ట్రాప్ చేసి రూ.3.5 లక్షల దోపిడీ.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్.!
US Stocks: కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు.. ట్రిలియన్ డాలర్లు కోల్పోయిన టెకీ కంపెనీలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

