CJI Justice Chandrachud | గణనీయమైన మార్పులకు సిద్ధంగా ఉంది : సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
CJI Justice Chandrachud | క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో గణనీయమైన మార్పులకు భారతదేశం సిద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌లో భారతదేశ ప్రగతిశీల మార్గం’ అనే అంశంపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీజేఐ ప్రారంభోపన్యాసం చేశారు.
CJI Justice Chandrachud | క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో గణనీయమైన మార్పులకు భారతదేశం సిద్ధంగా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. ‘క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్‌లో భారతదేశ ప్రగతిశీల మార్గం’ అనే అంశంపై కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో సీజేఐ ప్రారంభోపన్యాసం చేశారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), భారతీయ సాక్ష్యాధారాల చట్టం (BSA)పై అవగాహన కల్పించేందుకు న్యాయమంత్రిత్వ శాఖ సదస్సును నిర్వహించింది.
ఇండియన్ పీనల్ కోడ్, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ చట్టాల స్థానంలో కొత్త చట్టాలను కేంద్రం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. కొత్తగా అమలులోకి వచ్చిన చట్టాలు నేర న్యాయంపై భారతదేశం చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను కొత్త యుగంగా మార్చాయన్నారు. బాధితుల ప్రయోజనాలను కాపాడేందుకు, నేరాలపై విచారణ జరిపేందుకు ఈ మార్పు చేయడం చాలా ముఖ్యమన్నారు. కొత్త చట్టాలకు పార్లమెంట్ ఆమోదం తెలపడం దేశం మారుతున్నదని, పురోగమిస్తోందనడానికి సంకేతమని.. ప్రస్తుత సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త చట్టపరమైన చర్యలు అవసరమని సీజేఐ అన్నారు.
కొత్త క్రిమినల్ చట్టాల ద్వారా తీసుకువచ్చిన మార్పుల నుంచి దేశం పూర్తిగా ప్రయోజనం పొందేలా అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు. ఫోరెన్సిక్ నిపుణులు, పరిశోధకులకు శిక్షణ ఇవ్వడంతోపాటు మన కోర్టు వ్యవస్థపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సదస్సులో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maya Lady | ఒకే శరీరంలో ఇద్దరు మనుషులు.. ఆసక్తికరంగా ‘మాయ లేడీ’ ట్రైలర్!
Jeevan Reddy | రేవంత్‌రెడ్డి తెలంగాణకు శనిలా దాపురించాడు.. జీవన్ రెడ్డి ఫైర్
KTR | వీరప్పన్‌ను అటవీశాఖ మంత్రిని చేస్తే ఎలా ఉంటదో.. భూములు అమ్మే బ్రోకర్ రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే అలానే ఉంది : కేటీఆర్
Chief Minister Vijay | ముఖ్యమంత్రి విజయ్‌కి పూలు ఇచ్చి ప్రపోజ్ చేసిన చిన్నారి.. వీడియో వైరల్!
Polio | ప్రపంచంలో ఇప్పటికీ కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతున్న పోలియో.. కారణాలేమిటి..?
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

