CJP | ఢిల్లీలోని పార్లమెంట్ వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నీట్-యూజీ (NEET-UG) పరీక్షల అక్రమాలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద చేపట్టిన ‘చలో పార్లమెంట్’ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సీజేపీ మద్దతు దారులు బారికేడ్లను తోసుకొని పార్లమెంట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి ఆందోళనకారులను చెదరగొట్టారు.
And it has finally begun.
Security personnel using lathicharge to disperse crowd at CJP protest in Delhi. pic.twitter.com/JYTNKLq0Tj
— Piyush Rai (@Benarasiyaa) July 20, 2026
రైసినా రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది. పార్లమెంట్‌కు సుమారు 200 మీటర్ల దూరంలో ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. జంతర్ మంతర్ నుంచి సీజేపీ.. పార్లమెంట్ మార్చ్ చేపట్టిన విషయం తెలిసిందే. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా వద్ద ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. సీజేపీ కార్యకర్తలను చెదరగొట్టే ఉద్దేశంతో టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. సన్సద్ మార్గ్ రోడ్డులో వస్తున్న ఆందోళనకారుల్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. సన్సద్ మార్గ్ పోలీసు స్టేషన్ వద్ద బారికేడ్లు పెట్టి నిరసనకారుల్ని ముందుకు కదలకుండా చేశారు.
🚨Smoke bombs fired at CJP protesters as they reach near the Parliament building pic.twitter.com/4pkRN38b70
— The Tatva (@thetatvaindia) July 20, 2026
భద్రతా బలగాలు లాఠీఛార్జ్ చేశాయి. ఆ ఘర్షణలో కొందరు ఆందోళనకారులు గాయపడ్డారు. సైట్ వద్దే వారికి ప్రథమ చికిత్స అందించారు. వికాస్ మార్గ్‌లోని ఐటీవో వద్ద కూడా నిరసనకారులను బ్లాక్ చేశారు. ఐటీవో, సెంట్రల్ ఢిల్లీ రూట్లో ఇది కీలకమైన ప్రదేశం. పార్లమెంట్, జంతర్ మంతర్ ఈ మార్గంలోనే ఉన్నాయి. పార్లమెంట్ స్ట్రీట్ వద్ద వేల సంఖ్యలో సీజేపీ కార్యకర్తలు చేరుకున్నారు. వారిపై లాఠీఛార్జ్ జరిగినట్లు తెలుస్తోంది. బారికేడ్లను తొలగించేందుకు నిరసనకారులు ప్రయత్నించారు. పోలీసులకు, సీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. సుమారు 15 మంది ఆందోలనకారులను అదుపులోకి తీసుకున్నారు.
Police cracks down on CJP protesters at Parliament street. pic.twitter.com/e8j6H1TsVL
— News Arena India (@NewsArenaIndia) July 20, 2026