సైన్యానికి కత్తెర.. 2 లక్షల బలగాలను తగ్గించుకునే యోచనలో కేంద్రం
తమ రక్తంలో నరనరానా దేశభక్తి నిండిపోయిందనే విధంగా గప్పాలు కొట్టుకొనే బీజేపీ సర్కారు.. దేశ భద్రతనే పణంగా పెట్టేలా ముందుకు వెళ్తున్నది.
- ఇప్పటికే ఆర్మీలో 1.35 లక్షల మంది సైనికుల కొరత
- రెండేండ్లుగా సైన్యంలో లేని కొత్త నియామకాలు
న్యూఢిల్లీ, ఆగస్టు 9: తమ రక్తంలో నరనరానా దేశభక్తి నిండిపోయిందనే విధంగా గప్పాలు కొట్టుకొనే బీజేపీ సర్కారు.. దేశ భద్రతనే పణంగా పెట్టేలా ముందుకు వెళ్తున్నది. ఒకవైపు చైనా, మరో వైపు పాకిస్థాన్ భద్రతా పరంగా సవాళ్లు విసురుతున్న ప్రస్తుత తరుణంలో సైన్యాన్ని బలోపేతం చేయాల్సింది పోయి కత్తెర వేసేందుకు సిద్ధమవుతున్నది. గత రెండేండ్లుగా అసలు శాశ్వత నియామకాలే చేపట్టని కేంద్రం.. ఇప్పుడు సైనిక సిబ్బందిని తగ్గించుకునేందుకు యోచిస్తున్నది. ఇప్పటికే సిబ్బంది కొరతతో సతమతమవుతున్న సైన్యానికి ఇది శరాఘాతంగా మారనున్నది. రాబోవు రెండేండ్లలో దాదాపు 2 లక్షల మేర సైన్యాన్ని తగ్గించుకోనున్నట్టు సమాచారం. ఇదే సమయంలో జమ్ముకశ్మీర్‌లోని ఉగ్రవాద నిరోధక విభాగాలైన రాష్ట్రీయ రైఫిల్స్(ఆర్ఆర్)లో పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ ఉంటుందని రక్షణశాఖ వర్గాలు పేర్కొన్నట్టు ‘ది ప్రింట్’ అనే మీడియా సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం 12.8 లక్షలుగా ఉన్న సైన్యం బలగాన్ని 10.8 లక్షలకు కుదించుకోవాలని సైన్యం చూస్తున్నదని రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.
రెండేండ్లుగా నియామకాల్లేవ్..
గత రెండేండ్లుగా సైన్యంలో కొత్త నియామకాలు అనేవి దాదాపుగా లేవు. దీంతో ఆర్మీ ఇప్పటికే 1.35 లక్షల సైనికుల కొరతను ఎదుర్కొంటున్నది. ఇదే సమయంలో కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ను అమలు చేసినప్పటికీ, ఈ ఏడాదికి 35 నుంచి 40 వేల మంది మాత్రమే రిక్రూట్మెంట్ జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సరాసరిన ఏడాదికి ఆర్మీలో దాదాపుగా 60 వేల మంది పదవీ విరమణ పొందుతుంటారు. ఈ భాగంలో అగ్నిపథ్ కొంత కొరతను మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉన్నదని, కొరత మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారి ఒకరు వివరించారు. నేషనల్ క్యాడెట్ కార్ప్స్(ఎన్సీసీ)తో పాటుగా రెజిమెంటల్ హెడ్‌క్వార్టర్స్‌లో కూడా డిప్యూటేషన్లు గణనీయంగా తగ్గుతాయని పేర్కొన్నారు.
రాష్ట్రీయ రైఫిల్స్‌లో భారీ మార్పులు
కేంద్రం యోచిస్తున్న కొత్త పాలసీ ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రీయ రైఫిల్స్ మోహరింపులో పునర్వ్యవస్థీకరణ అంశం పరిగణనలో ఉన్నదని సమాచారం. జమ్ముకశ్మీర్‌లో 63 ఆర్ఆర్ బెటాలియన్లు ఉన్నాయి. ఇవి ఇతర ఆర్మీ యూనిట్ల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ప్రతి బెటాలియన్‌లో ఆరు కంపెనీల బలగాలు ఉండగా, రెగ్యులర్ పదాతిదళ నిర్మాణంలో నాలుగు ఉంటాయి. ప్రతి ఆర్ఆర్ కంపెనీలో 100-150 మంది సైనికులు ఉంటారు. ఇప్పుడు బెటాలియన్‌లో కంపెనీల సంఖ్యను రెండుకు తగ్గించడంతో పాటు మొత్తం బెటాలియన్ల సంఖ్యను కూడా కుదింది, ఏరియా ఆఫ్ రెస్పాన్సిబులిటీ(ప్రతి బెటాలియన్‌కు అప్పగించే ప్రాంతం బాధ్యత) పెంచవచ్చా? అనేదానిపై కేంద్రం ఆలోచన చేస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- center govt
- force
- Indian Army
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

