Aadhar-Voter ID Linking: ఓటరు కార్డుతో ఆధార్ లింక్.. బిల్లుకు లోక్‌సభ ఆమోదం

న్యూఢిల్లీ: ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానికి సంబంధించిన బిల్లుకు లోక్‌సభలో ఆమోదం దక్కింది. ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021.. మూజువాణి ఓటు ద్వారా క్లియరెన్స్ పొందింది. అయితే ఇవాళ మధ్యాహ్నంఒ స్వల్ప చర్చ తర్వాత ఎన్నికల చట్టాల సవరణ బిల్లుకు ఆమోదం దక్కింది. ఈ బిల్లు ఆమోదంతో ఇప్పుడు ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం తప్పనిసరి అయ్యింది. ఇక నుంచి ఓటు రిజిస్టర్ చేసుకోవాలనుకునే వారి నుంచి ఎన్నికల రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు ఆధార్ నెంబర్‌ను తీసుకుంటారు. ఐడెంటినీ గుర్తించేందుకు ఇది అవసరం అవుతుందని మంత్రి రిజిజు తెలిపారు. మూజు వాణి ఓటు ద్వారా బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఇవాళ ఉదయం ఎన్నికల చట్టాల సవరణ 2021 బిల్లును మంత్రి రిజిజు ప్రవేశపెట్టారు. ఆ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి.
ఓటరు కార్డుతో ఆధార్‌ను లింక్ చేయాలన్న ఉద్దేశంతో ఎన్నికల చట్టాల సవరణ బిల్లును కేంద్రం తీసుకువచ్చింది. లోక్‌సభలో ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి. బోగస్ ఓటింగ్, నకిలీ ఓటింగ్‌ను నిర్మూలించాలంటే ఈ బిల్లుకు ఆమోదం తప్పదని మంత్రి రిజిజు తెలిపారు. ఆధార్ చట్టం ప్రకారం ఆధార్‌ను ఓటర్ కార్డుతో అనుసంధానం చేయరాదు అని కాంగ్రెస్ నేత మనీష్ తివారీ అన్నారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
విపక్ష నేతలు అసదుద్దీన్ ఓవైసీ, శశిథరూర్ కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. ఆధార్‌ను కేవలం అడ్రస్ ప్రూఫ్‌గా వాడారని, కానీ అది పౌరసత్వ ద్రవీకరణ పత్రం కాదు అని శశిథరూర్ అన్నారు. ఓటర్లను ఆధార్ అడిగితే, అప్పుడు కేవలం అడ్రస్ డాక్యుమెంట్ మాత్రమే వస్తుందని, అంటే పౌరులు కాని వారికి మీరు ఓటు వేసే హక్కు కల్పిస్తున్నట్లు అవుతుందని ఎంపీ శశిథరూర్ ఆరోపించారు. ఎన్నికల చట్టాల సవరణ బిల్లును స్టాండింగ్ కమిటీకి సిఫారసు చేయాలని కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heavy traffic jam | హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
Rashmika | విజయ్ దేవరకొండ ఇంకా నల్లపూసలు కొనివ్వలేదు.. రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు!
Sambarala Yeti Gattu | ‘సంబరాల ఏటి గట్టు’ రిలీజ్ డేట్ వివాదం.. నిర్మాతకు ఫోన్ చేసి వార్నింగ్!
Ramayana | ‘రామాయణ’ను 3డీలోనే చూడండి.. ప్రేక్షకులకు సాయిపల్లవి ప్రత్యేక విజ్ఞప్తి!
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో అసలు కథ ఏంటో చెప్పనున్న టీమ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

