Pawar- Baramati | దేశంలోని ప్రముఖ లోక్ సభ స్థానాల్లో ‘బారామతి’ ఒకటి. ఈ స్థానం నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ రాజకీయవేత్త, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్.. ప్రస్తుతం ఆయన కూతురు సుప్రియా సూలే ఈ స్థానం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ దఫా ‘బారామతి’లో ‘పవార్’ వారసత్వం కోసం పోరాటం సాగుతున్నది. బాబాయి శరద్ పవార్ తో విభేదించి మహారాష్ట్రలోని బీజేపీ-శివసేన (ఏక్ నాథ్ షిండే) సర్కార్ లో చేరిన ఎన్సీపీ నేత అజిత్ పవార్ సతీమణి సునేత్ర పవార్ పోటీలో ఉన్నారు. వదిన (సునేత్ర), మరదలు (సుప్రియా సూలే) మధ్య జరుగుతున్న పోరాటం మరాఠీ ప్రజలందరినీ ఆకర్షిస్తున్నది.
ఈ క్రమంలో తన సతీమణికి ‘పవార్ కార్డ్’పై ఓటేసి పార్లమెంటుకు పంపాలని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రజలను అభ్యర్థించారు. అజిత్ పవార్ ‘పవార్ కార్డ్’ నినాదంపై శరద్ పవార్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సునేత్ర పవార్.. ఔట్ సైడ్ పవార్ అని పేర్కొన్నారు. దీనిపై మీడియా ప్రశ్నించినప్పుడు సునేత్ర పవార్ బోరుమని విలపించారే తప్ప, స్పందించలేదు. మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇప్పుడు సునేత్ర పవార్ విలపిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.