మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలంటూ వ్యక్తికి అధికారుల ఫోన్

ముంబై: మరణ ధృవీకరణ పత్రాన్ని తీసుకెళ్లాలంటూ జీవించి ఉన్న వ్యక్తికి అధికారులు ఫోన్ చేశారు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన జరిగింది. చంద్రశేఖర్ దేశాయ్ అనే వ్యక్తికి థానే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఫోన్ వచ్చింది. తన డెత్ సర్టిఫికెట్ను తీసుకెళ్లాలని అధికారులు తనతో చెప్పినట్లు ఆయన ఆరోపించారు. కాగా ఈ జాబితా తమకు పూణె కార్యాలయం నుంచి అందిందని థానే డిప్యూటీ కమిషనర్ తెలిపారు. మరణించిన వారి జాబితాలో ఆ వ్యక్తి పేరు ఉండటం సాంకేతిక లోపమని అన్నారు. జాబితాను ధృవీకరించిన తర్వాతే సంబంధిత వ్యక్తులకు ఫోన్ చేయాలని తమ సిబ్బందికి ఆదేశించినట్లు ఆయన చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

