శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లా హైదర్‌పొరాలో భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఈ కాల్పుల్లో ఇప్పటికే ఒక గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడు. బుద్గామ్‌లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా భద్రతాబలగాలు, స్థానిక పోలీసులు సంయుక్తంగా కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా హైదర్‌పొరాలో ఉగ్రవాదులు తారసపడటంతో ఎన్కౌంటర్ మొదలైంది.
భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు ఇంకా కొనసాగుతున్నాయని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ ఎన్కౌంటర్లో ఒక గుర్తు తెలియని ఉగ్రవాది హతమయ్యాడని చెప్పారు.