ఉగ్ర కుట్ర భగ్నం

- ఆరుగురిని అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు
- పాక్‌లో శిక్షణ పొందిన ఇద్దరు ఉగ్రవాదులు
- నవరాత్రి ఉత్సవాల్లో పేలుళ్లకు కుట్ర
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: పాకిస్థాన్ హస్తమున్న ఉగ్ర కుట్రను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. పాక్-ఐఎస్ఐ శిక్షణ పొందిన ఇద్దరు ఉగ్రవాదులతో పాటు ఆరుగుర్ని అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో ఓ స్థావరం నుంచి ఆర్డీఎక్స్తో తయారుచేసిన శక్తిమంతమైన పేలుడు పదార్థాలను (ఐఈడీ) స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, మహారాష్ట్ర, యూపీలో నవరాత్రి ఉత్సవాలు, రామ్ లీలా సందర్భంగా భారీ దాడులు చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. ఉగ్ర కుట్రను భగ్నం చేసేందుకు ఆయా రాష్ర్టాల్లో పోలీసుల ఆపరేషన్ సాగింది. అరెస్ట్ చేసిన వ్యక్తులను జాన్ మహమ్మద్ షేక్ అలియాస్ సమీర్ (47), ఒసామా (22), మూల్‌చంద్ (47), జీషన్ (28), మహమ్మద్ అబూ బకర్ (23), మహమ్మద్ అమీర్ జావెద్ (31)గా గుర్తించారు. ఒసామా, జీషన్లు పాక్‌లో శిక్షణ పొందారు. వీరిద్దరూ పాక్‌కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆదేశాల ప్రకారం పనిచేస్తున్నారు. సమీర్… అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీమ్ సోదరుడు అనీస్ ఇబ్రహీంకు సన్నిహితుడు. ఐఈడీతో పాటు ఆయుధాలు, గ్రనేడ్లను వేర్వేరు చోట్లకు అందజేయాలని సమీర్‌కు అనీస్ నుంచి ఆదేశాలు అందినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- navratri
- Terrorists
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

