MK Stalin | రాష్ట్రంలో అరు నెలల్లోపే అసెంబ్లీ ఎన్నికలు.. సిద్ధంగా ఉండాలని డీఎంకే శ్రేణులకు ఎంకే స్టాలిన్ పిలుపు..!
MK Stalin | తమిళనాడు (Tamil Nadu) లో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉందని డీఎంకే అధ్యక్షుడు (DMK president) ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, మూడు నెలలు లేదా ఆరు నెలల్లో ఎన్నికలు రావొచ్చని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
MK Stalin : తమిళనాడు (Tamil Nadu) లో రాజకీయ పరిణామాలు వేగంగా మారే అవకాశం ఉందని డీఎంకే అధ్యక్షుడు (DMK president) ఎంకే స్టాలిన్ (MK Stalin) అన్నారు. మరో ఐదేళ్లు ఎదురుచూడాల్సిన అవసరం లేదని, మూడు నెలలు లేదా ఆరు నెలల్లో ఎన్నికలు రావొచ్చని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. చెన్నై (Chennai) లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాజీ మంత్రి బెంజమిన్‌తో పాటు పలువురు ఏఐఏడీఎంకే నేతలు, కార్యకర్తలు డీఎంకేలో చేరారు.
ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వానికి సొంతంగా మెజారిటీ లేదన్నారు. 118 సీట్ల మెజారిటీ అవసరం కాగా ఆ పార్టీకి 108 స్థానాలే వచ్చాయని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇతర పార్టీల మద్దతుతోనే కొనసాగుతోందన్నారు. ఇటీవల వరకు డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయూఎంఎల్ మద్దతుతోనే ప్రభుత్వం నడుస్తోందని చెప్పారు. అలాంటి ప్రభుత్వం ఎంతకాలం కొనసాగుతుందో చెప్పలేమన్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియదని వ్యాఖ్యానించారు.
అందుకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం కావాలని స్టాలిన్ సూచించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాకుండా ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో పని ప్రారంభించాలని కోరారు. డీఎంకేను మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. టీవీకే ప్రభుత్వంపై కూడా స్టాలిన్ విమర్శలు గుప్పించారు. గత నెల రోజులుగా రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందన్నారు. పెట్టుబడిదారులు ఇతర రాష్ట్రాలకు వెళుతున్నారని అన్నారు. మహిళలపై నేరాలు, మాదకద్రవ్యాల కేసులు, దోపిడీలు, పెట్రోల్ బాంబు దాడులు, విద్యుత్ కోతలు పెరిగాయని విమర్శించారు.
ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ కూడా ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు తమిళనాడులో ఉన్న సుపరిపాలన ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ప్రజలు విద్యుత్, తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం పాలన కంటే ప్రచారంపైనే ఎక్కువ దృష్టి పెడుతోందని విమర్శించారు. అసెంబ్లీ సమావేశాలు సభలా కాకుండా సినిమా షూటింగ్‌లా మారిపోయాయని ఎద్దేవా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కొత్తగూడెం ఇంటి పట్టాల పంపిణీ అవినీతిపై ఎమ్మెల్యే స్పందించాలి’
‘నిరుద్యోగ యువతను నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం’
NagaChaitanya | ‘వృషకర్మ’ ప్రమోషన్లలో సరికొత్త ట్రెండ్.. పెద్దపల్లి రామగిరి ఖిల్లాపై నాగచైతన్య సాహసయాత్ర
Huzurabad | సగరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
Karan Johar | సోషల్ మీడియా అల్గారిథమ్ నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది: కరణ్ జోహార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?

