Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Rahul Gandhi | సర్ (SIR) పేరుతో ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం (Ramleela Maidan) లో నవంబర్ 1న ప్రతిపక్ష ఇండియా కూటమి (INDI bloc) ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసనను వాయిదా వేయాలని స్థానిక వ్యాపార వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీపావళి పండగ (Diwali Fest) నేపథ్యంలో తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేస్తూ ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి లేఖ రాశాయి.
Rahul Gandhi : సర్ (SIR) పేరుతో ఓట్ల చోరీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని రామ్‌లీలా మైదానం (Ramleela Maidan) లో నవంబర్ 1న ప్రతిపక్ష ఇండియా కూటమి (INDI bloc) ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసనను వాయిదా వేయాలని స్థానిక వ్యాపార వర్గాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. దీపావళి పండగ (Diwali Fest) నేపథ్యంలో తమ వ్యాపారాలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేస్తూ ఇటీవల కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కి లేఖ రాశాయి. ఈ లేఖపై ఆయన తాజాగా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
ఢిల్లీలోని ప్రతి వ్యాపారి మాటను తాము వింటున్నామని, వారి సమస్యలను అర్థం చేసుకుంటున్నామని రాహుల్‌గాంధీ అన్నారు. అయితే
మెట్రోలను ప్రభుత్వమే నిలిపివేసిందని, రోడ్లనూ మూసివేసిందని, దేశ రాజధానిని లాక్డౌన్లో ఉంచిందని విమర్శించారు. ఓట్లనే చోరీ చేస్తే.. ఇక మీ దుకాణాలు, సేవింగ్స్, పిల్లల భవిష్యత్తు.. ఏదీ సురక్షితం కాదని అన్నారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రధాని నరేంద్ర మోదీతో చెప్పాలని, అప్పుడు 30 సెకన్లలోనే ఈ నిరసనలన్నీ ఆగిపోతాయని వ్యాపారులను ఉద్దేశించి రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
దీపావళి పండగ సీజన్లో ఢిల్లీలో పెద్దఎత్తున వ్యాపార కార్యకలాపాలు జరుగుతాయని ‘ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI)’ పేర్కొన్నది. అయితే నవంబర్ 1న చేపట్టే నిరసన కారణంగా రామ్‌లీలా మైదానం పరిసరాల్లో దాదాపు రూ.10 వేల కోట్ల వ్యాపారంపై ప్రభావం పడవచ్చని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో నవంబర్ 10 తర్వాత నిరసనలు నిర్వహించాలని కోరుతూ రాహుల్ గాంధీకి లేఖ రాసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ప్రధాని మోదీతో ఆ మాట చెప్పండి నిరసనలు 30 సెకన్లలో ఆగిపోతాయి.. వ్యాపారుల లేఖపై రాహుల్‌గాంధీ..!
Fungus Infections | క్యాన్సర్ లేదా అవయవ మార్పిడి పేషెంట్లకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు ఎందుకు ప్రమాదకరం అవుతాయి..?
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

