కరోనా పంజా.. టాప్ మావోయిస్టు నేతల మరణం.. వైరస్ బారిన మరికొందరు..!
కరోనా పంజా.. టాప్ మావోయిస్టు నేతల మరణం.. వైరస్ బారిన మరికొందరు..!| కరోనా మహమ్మారి ప్రభావంతో టాప్ మావోయిస్టు నేతలు దుర్మరణం పాల.....

హైదరాబాద్: కరోనా మహమ్మారి ఎవరినీ వదిలి పెట్టడం లేదు. విప్లవ సాధన కోసం అడవులను క్షేత్రాలుగా చేసుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న మావోయిస్టులు కూడా మహమ్మారి బారిన పడ్డారు. ఇప్పటివరకు భద్రతా దళాలతో పోరాడే మావోయిస్టులు.. ఇప్పుడు కోవిడ్-19తోనూ పోరాడాల్సిన దుస్థితిలో ఉన్నారు.
తెలంగాణతోపాటు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల్లోని అడవుల్లో విస్తరించి ఉన్న మావోయిస్టులు ఇంతకుముందు చికున్‌గున్యా, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడి ప్రాణాలు కోల్పోయేవారు. తాజాగా ప్రాణాంతక కరోనా మహమ్మారి విసిరిన పంజాకు అగ్రశ్రేణి మావోయిస్టు నేతలు ప్రాణాలు కోల్పోయారని నక్సలైట్ల వ్యతిరేక ఇంటెలిజెన్స్ వింగ్.. స్పెషల్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్, నాయకురాలు సిద్దబోయిన సారక్క అలియాస్ భారతక్కలు కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
కరోనా సెకండ్ వేవ్ వల్ల కనీసం ఎనిమిది మంది మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారని భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్ దత్ తెలిపారు. మరో 15-20 మంది తీవ్రంగా కరోనా బారిన పడ్డారని పోలీస్ వర్గాల కథనం. కరోనా భయంతోనే మరికొందరు పార్టీని వీడారని సమాచారం.
సకాలంలో వైద్య చికిత్స అందకపోవడం, పాడైన ఆహారం తినడం, పాము కాటు వంటి ఘటనలతోపాటు ప్రకృతిలో వైవిధ్య భరితమైన మార్పుల వల్ల మావోయిస్టుల ఆరోగ్యం దెబ్బ తింటున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

