Tejasvi Surya | రాహుల్ గాంధీ ఉగ్రవాదులతో భేటీ అయినా ఆశ్చర్యం లేదు : తేజస్వి సూర్య
Tejasvi Surya : రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తప్పుపట్టారు.
Tejasvi Surya : రిజర్వేషన్ల తొలగింపుపై కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తప్పుపట్టారు. తేజస్వి బెంగళూర్‌లో శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రిజర్వేషన్ల తొలగింపుపై రాహుల్ వ్యాఖ్యలు ఆందోళనకరమని చెప్పారు. రాహుల్ గాంధీ ఎవరెవరితో సమావేశమవుతున్నారో చూస్తే విస్మయం కలుగుతుందని అన్నారు. భారత్ వ్యతిరేకి ఇల్హర్ ఒమర్‌తో రాహుల్ భేటీ అయ్యారని, ఖలిస్తాన్, పాకిస్తాన్, చైనా, బంగ్లాదేశ్ ఏజెంట్లతో ఆయన సమావేశాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు.
రాహుల్ గాంధీ ఓరోజు ఉగ్రవాదులతో సమావేశమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ విపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో కేంద్ర ప్రభుత్వం సహా బీజేపీ, ఆరెస్సెస్ లక్ష్యంగా విమర్శలు గుప్పించడం పట్ల కాషాయ నేతలు భగ్గుమన్నారు. విదేశీ గడ్డపై దేశాన్ని అవమానించడం రాహుల్‌కు అలవాటుగా మారిందని మండిపడుతున్నారు. ఇక రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ దినేష్ శర్మ స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు భారత్ ఎకానమీ ప్రపంచంలో 11వ స్ధానంలో ఉండగా ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఎకానమీగా ఎదిగిందని అన్నారు.
త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్ధగా భారత్ అవతరించనుందని పేర్కొన్నారు. రక్షణ రంగంలో భారత్ ప్రస్తుతం ఆయుధాలు తయారుచేస్తోందని, భారత్ ఎడ్యుకేషన్ హబ్‌గా ఎదిగిందని, ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల విద్యార్ధులు ఇక్కడికి చదువుకునేందుకు వస్తున్నారని శర్మ వివరించారు. మనం సొంతంగా కొవిడ్ వ్యాక్సిన్‌ను తయారుచేశామని ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సిన్లను సరఫరా చేశామని గుర్తుచేశారు. భారత్ పలు రంగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరుస్తుంటే రాహుల్ గాంధీ మాత్రం విదేశీ పర్యటనల సందర్భంగా తన అసహనం వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు.
Read More :
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు బెయిల్.. సుప్రీంకోర్టు షరతులు ఇవే..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

