Tejas Crash | తేజస్ పైలట్ దుర్మరణం.. ప్రమాదంపై విచారణకు ఆదేశించిన ఐఏఎఫ్..!
Tejas Crash : దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా భారత వాయుసేనకు సంబంధించిన తేజస్ (Tejas) యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ దుర్మరణం చెందాడు. ప్రమాదంలో తీవ్రమైన గాయాలు కావడంతో వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ (Namansh Syal) మరణించాడని భారత వాయుసేన (IAF) వెల్లడించింది.
Tejas Crash : దుబాయ్ ఎయిర్ షో సందర్భంగా భారత వాయుసేనకు సంబంధించిన తేజస్ (Tejas) యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనలో పైలట్ దుర్మరణం చెందాడు. ప్రమాదంలో తీవ్రమైన గాయాలు కావడంతో వింగ్ కమాండర్ నమాన్ష్ స్యాల్ (Namansh Syal) మరణించాడని శుక్రవారం సాయంత్రం భారత వాయుసేన (IAF) వెల్లడించింది. ఈ ప్రమాదంలో పైలట్ చనిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ జరిపిస్తామని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది.
‘దుబాయ్ ఎయిర్ షోలో పాల్గొన్న భారత వాయుసేనకు చెందిన తేజస్ యుద్ధ విమానం ఈరోజు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రమైన గాయాలు కావడంతో పైలట్ మృతి చెందాడు. ఆయన మరణం పట్ల ఐఏఎఫ్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. ఈ కష్ట సమయంలో ఆయన కుటుంబానికి ఐఏఎఫ్ అన్ని విధాలా అండగా ఉంటుంది. ఈ ప్రమాదానికి కారణాలతో పాటు పైలట్ మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు విచారణ జరిపిస్తాం’ అని ఐఏఎఫ్ ఎక్స్ పోస్ట్‌లో పేర్కొంది.
An IAF Tejas aircraft met with an accident during an aerial display at Dubai Air Show, today. The pilot sustained fatal injuries in the accident.
IAF deeply regrets the loss of life and stands firmly with the bereaved family in this time of grief.
A court of inquiry is being…
— Indian Air Force (@IAF_MCC) November 21, 2025
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో జరిగిన ఎయిర్ షోలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేజస్ యుద్ధ విమానం విన్యాసాలకు సిద్ధమైంది. అయితే.. ఉన్నట్టుండి ఆ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో దట్టమైన పొగతో తేజన్ ఫ్లైట్ కింద పడిపోయింది. ఘటనా స్థలికి అత్యవసర సాయం బృందాలు చేరుకున్నాయి. కానీ, పైలట్ నమాన్ష్ ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయారు.
విధి నిర్వహణలో నిమాన్ష్ మరణిచండంతో మిజోరం గవర్నర్ వీకే సింగ్ దిగ్భ్రాంతి చెందారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(HAL)తో 97 తేజస్ విమానాల కోసం భారత రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. వచ్చే ఏడాదికల్లా ఈ విమానాలను సైన్యానికి హెచ్ఏఎల్ అప్పగించాల్సి ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

