Tej Pratap Yadav : ఆర్జేడీ అధ్యక్షుడు (RJD chief), బీహార్ (Bihar) మాజీ ముఖ్యమంత్రి (Former CM) లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ (Tej Pratap Yadav) మరోసారి వార్తల్లో నిలిచారు. రిలేషన్షిప్లో ఉన్నానంటూ ఆయన ఫేస్బుక్లో ప్రత్యక్షమైన ఓ పోస్టు గంటల్లోనే వైరల్‌గా మారింది. బీహార్ అంతటా అది చర్చకు దారితీసింది. దీనిపై తేజ్‌ప్రతాప్ యాదవ్ స్పందించారు. వైరల్ అయిన పోస్టు తాను పెట్టింది కాదని, తన ఫేస్‌బుక్‌ను ఎవరో హ్యాక్ చేశారని చెప్పారు.
వివరాల్లోకి వెళ్తే.. శనివారం తేజ్ ప్రతాప్ ఫేస్బుక్లో ఒక పోస్టు ప్రత్యక్షమైంది. ఆయన ఒక మహిళతో ఉన్న ఫొటో ఆ పోస్టుకు జతచేసి ఉంది. ఆ మహిళ పేరు అనుష్క యాదవ్ అని, గత పన్నెండేళ్లుగా తాము రిలేషన్లో ఉన్నామని పేర్కొంటూ ఆ పోస్టు కింద టెక్స్ట్ రాసుకొచ్చారు. ఆ పోస్టు కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దాంతో తేజ్‌ప్రతాప్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసేందుకే ఎవరో ఇలాంటి పోస్టు చేశారని ఆరోపించారు. ఆ ఫొటో సైతం ఎడిట్ చేసిందని తెలిపారు. ఇలాంటి పుకార్లను నమ్మవద్దని తన అభిమానులను కోరారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ 2018 లో బీహార్ మాజీ ముఖ్యమంత్రి దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యను వివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలానికి వారి మధ్య విభేదాలు రావడంతో ఐశ్వర్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆయన మరో మహిళతో రిలేషన్లో ఉన్నారని ప్రచారం జరగడం చర్చనీయాంశంగా మారింది.