ఆటో ఎక్కిన యువతిపై సామూహిక అత్యాచారం.. మూడు గంటల తర్వాత రోడ్డుపైకి తోసేసి పరార్
Teenage Girl | మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా మానవ మృగాల తీరు మారడంలేదు. నిత్యం ఎక్కడో ఒకచోట ఆడపిల్లలపై
లక్నో: మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా మానవ మృగాల తీరు మారడంలేదు. నిత్యం ఎక్కడో ఒకచోట ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. కొత్తగా ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సిటీలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ట్యూషన్ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్న 18 ఏండ్ల యువతిపై ఆటోడ్రైవర్, అతని స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
యువతి ఆటో ఎక్కగానే నిందితులు ఆటోను దారి మళ్లించారు. కొత్త దారిలో ఎందుకు వెళ్తున్నారని ఆమె ప్రశ్నించడంతో తీవ్రంగా కొట్టారు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మూడు గంటలపాటు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ తర్వాత పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకుని, యువతిని రోడ్డుపైకి తోసేసి పారిపోయారు.
ఆ తర్వాత అటుగా పోలీస్ వ్యాన్ రావడం గమనించిన యువతి జరిగిన సంగతి వారితో చెప్పింది. కానీ వాళ్లు తక్షణమే చర్యలు తీసుకోకుండా బాధితురాలిని ఇంటి దగ్గర దిగబెట్టారు. రేపు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయమని చెప్పి వెళ్లిపోయారు. మర్నాడు బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
దాంతో పోలీసులు నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్‌లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు, బాధితురాలు చెప్పిన వెంటనే నిందితుల కోసం గాలించకుండా ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్లిన పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

