జైపూర్: రాజస్థాన్లో ఓ స్కూల్ టీచరు తన విద్యార్థిని పెండ్లి చేసుకుంది. అందుకు లింగమార్పిడి శస్త్రచికిత్స కూడా చేయించుకొంది. మీరా అనే పీఈటీ టీచరు కల్పనా ఫౌజ్దార్ అనే విద్యార్థినితో ప్రేమలో పడింది.. సారీ పడ్డాడు.
సంగతేంటంటే మీరా పుట్టింది అమ్మాయిగా. కానీ అన్నీ మగ లక్షణాలే. మానసికంగా కూడా మగవానిగానే భావించేది. కల్పనతో కలిసి జాతీయ అంతర్జాతీయ టోర్నమెంట్లకు వెళ్లేది. అలా అలా ఇద్దరి మధ్య చనువు పెరిగి ప్రేమగా మారింది. ఇద్దరూ పెండ్లి చేసుకోవాలనుకున్నారు. అందుకు మీరా ఆపరేషన్ చేయించుకొని ఆరవ్ కుంతల్గా మారిపోయింది. ఇద్దరూ పెండ్లి చేసుకొన్నారు. తల్లిదండ్రులు వీరిని ఆశీర్వదించారు.