Chandrababu | ఖైదీ నంబర్ 7691.. రాజమండ్రి జైలు స్నేహా బ్లాక్‌లో చంద్రబాబు
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill Development scam) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీసులు భారీ భద్రత నడుమ రోడ్డుమార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు (Rajahmundry central jail) తరలించారు.
రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో (Skill Development scam) అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు (Chandrababu) విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ రిమాండ్ (Judicial Remand) విధించింది. దీంతో ఏపీ మాజీ ముఖ్యమంత్రిని పోలీసులు భారీ భద్రత నడుమ రోడ్డుమార్గంలో రాజమండ్రి సెంట్రల్ జైలుకు (Rajahmundry central jail) తరలించారు. వర్షం కురుస్తుండటంతో విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి రాజమహేంద్రవరం చేరుకోవడానికి 5 గంటలకు పైగా పట్టింది. కోర్టు ఆదేశాల మేరకు బాబు కోసం జైలు అధికారులు స్నేహ బ్లాక్ (Sneha block) ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. జైలు దగ్గర 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
కాగా, చంద్రబాబుకు ఇంటి భోజనంతోపాటు మందులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. భద్రతా కారణాల వల్ల మిగతా ఖైదీలతో కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. అయితే బాబుకు బెయిల్ కోసం ఆయన లాయర్లు ప్రయత్నిస్తున్నారు. ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ వేసింది. ఇక బాబును విచారణ నిమిత్తం జ్యుడీషియల్ రిమాండ్‌కు అప్పగించాలని సీఐడీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ర్యాలీలు, సమావేశాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టిన సీఐడీ 28 పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించింది. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, విచారణ నిమిత్తం చంద్రబాబును 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి. ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. చివరకు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చంద్రబాబుకు 14 రోజు ల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

