భోపాల్: శుద్ధి చేసిన నూనెతో వెళ్తున్న ట్యాంకర్ బోల్తాపడింది. ఈ నేపథ్యంలో ఆ ట్యాంకర్ నుంచి నూనె రోడ్డుపై ఒలికిపోయింది. గమనించించిన స్థానికులు క్యాన్లు, పాత్రల్లో ఆ నూనె సేకరించేందుకు పోటీపడ్డారు. అయితే పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Refined Oil Tanker Overturns) మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. శుద్ధి చేసిన ఆయిల్ రవాణా చేస్తున్న ఒక ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ఆ ట్యాంకర్లోని నూనె బయటకు ఒలికిపోయింది.
కాగా, గమనించిన స్థానికులు క్యాన్లు, బకెట్లు, డబ్బాలు, ఇతర పాత్రల్లో ట్యాంకర్ నుంచి కారుతున్న నూనెను పట్టుకునేందుకు పోటీపడ్డారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నూనె సేకరిస్తున్న వారిని అడ్డుకోవడంతో పాటు చెదరగొట్టారు. దీంతో అక్కడ గందరగోళం చెలరేగింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Shocking In #Guna district, #MadhyaPradesh a tanker filled with refined oil overturned. Chaos broke out over looting the oil. People rushed in from their homes with buckets and containers. pic.twitter.com/LVf5O4xRjy
— Khoje Patrakaar (@khojepatrakaar) August 24, 2026