Senthil Balaji | మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా.. ఎందుకంటే?
తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji) తన పదవికి రాజీనామ చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే.
చెన్నై: తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ (Senthil Balaji) తన పదవికి రాజీనామ చేశారు. మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన ఆయన ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ (Bail Plea) మరో రెండు రోజుల్లో మద్రస్ హైకోర్టు ముందుకు రానున్నది. ఈ నేపథ్యంలో సెంథిల్ మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం.
కాగా, న్యాయపరమైన చిక్కుల వల్లే బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తున్నది. గత ఏడాది జూన్ 14న మనీలాండరింగ్ కేసులో బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బాలాజీపై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు డబ్బుకు ఉద్యోగా కుంభకోణం కేసు నమోదు చేశారు. ఈ కేసులో పెద్దఎత్తున డబ్బు చేతులు మారిందన్న ఆరోపణలపై ఈడీ బాలాజీని అరెస్టు చేసింది. జైలులో ఉన్నప్పటికీ బాలాజీని సీఎం స్టాలిన్ తన మంత్రివర్గంలోనే కొనసాగించారు. అయితే ఏ శాఖను కేటాయించలేదు. అయితే దీనిపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తంచేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం స్టాలిన్‌కు కోర్టు సూచించింది. దీంతో బెయిల్ పిటిషన్ రెండోసారి హైకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

