Ministers portfolios | తమిళనాడు మంత్రులకు శాఖలు కేటాయింపు.. సీఎం విజయ్ వద్ద హోం శాఖ
Ministers portfolios | తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలను శనివారం కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రి విజయ్ తన వద్దే ఉంచుకున్నారు.
చెన్నై: తమిళనాడులో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలోని మంత్రులకు శాఖలను శనివారం కేటాయించారు. హోం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం వంటి కీలక శాఖలను ముఖ్యమంత్రి విజయ్ తన వద్దే ఉంచుకున్నారు. (Ministers portfolios) ప్రజా, సాధారణ పరిపాలన, రెవెన్యూ, ప్రత్యేక కార్యక్రమాల అమలు, యువజన, వృద్ధులు, దివ్యాంగుల సంక్షేమం, పురపాలక పరిపాలన, పట్టణ, నీటి సరఫరా శాఖల బాధ్యతలు కూడా ఆయన నిర్వహించనున్నారు.
కాగా, సీనియర్ నేత కేఏ సెంగోట్టయ్యన్‌కు ఆర్థిక శాఖ కేటాయించారు. కొత్త ప్రభుత్వంలో ఆర్థిక, పెన్షన్లు, పెన్షన్ అలవెన్సుల శాఖలను ఆయన నిర్వహిస్తారు. విజయ్ కేబినెట్లో పిన్న వయస్కురాలైన మంత్రి సెల్వి ఎస్ కీర్తనకు పరిశ్రమల శాఖను కేటాయించారు. పెట్టుబడుల ప్రోత్సాహా శాఖ బాధ్యతలను కూడా ఆమె పర్యవేక్షిస్తారు.
మరోవైపు టీవీకేలో కీలకమైన ఎన్ ఆనంద్ గ్రామీణాభివృద్ధి, జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీలు, పంచాయతీ యూనియన్, పేదరిక నిర్మూలన, గ్రామీణ రుణగ్రస్తత, చిన్న నీటిపారుదలతో సహా సాగునీటి ప్రాజెక్టులు ఆయన పరిధిలోని శాఖల్లో ఉన్నాయి.
మరో మంత్రి ఆదవ్ అర్జునకు ప్రజా పనులు, క్రీడాభివృద్ధి శాఖలు కేటాయించారు. క్రీడాభివృద్ధితో పాటు భవనాలు, రహదారులు, చిన్న ఓడరేవులతో సహా ప్రజా పనులను ఆయన పర్యవేక్షిస్తారు. డాక్టర్ కేజీ అరుణ్‌రాజ్‌కు ఆరోగ్యం, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖలను కేటాయించారు.
కాగా, పి. వెంకటరమణన్‌కు ఆహార, పౌర సరఫరాల శాఖలు లభించాయి. వినియోగదారుల పరిరక్షణ, ధరల నియంత్రణ వ్యవహారాలు కూ ఆయన పర్యవేక్షణలో ఉన్నాయి. మరో మంత్రి ఆర్. నిర్మల్ కుమార్‌కు ఇంధన వనరులు, న్యాయ శాఖ బాధ్యతలు అప్పగించారు. విద్యుత్, సంప్రదాయేతర ఇంధన అభివృద్ధి, న్యాయ శాఖ, న్యాయస్థానాలు, జైళ్లు, అవినీతి నివారణ, శాసనసభ, గవర్నర్, ఎన్నికలు, పాస్‌పోర్ట్‌ల శాఖలు ఆయన పరిధిలోకి వస్తాయి.
మంత్రి రాజ్‌మోహన్‌కు పాఠశాల విద్య, తమిళ అభివృద్ధి, సమాచార, ప్రచార శాఖ బాధ్యతలు అప్పగించారు. పురావస్తు శాస్త్రం, తమిళ అధికార భాష, తమిళ సంస్కృతి, ఫిల్మ్ టెక్నాలజీ, సినిమాటోగ్రాఫ్ చట్టం, న్యూస్‌ప్రింట్ నియంత్రణ, స్టేషనరీ, ప్రింటింగ్, ప్రభుత్వ ముద్రణాలయాలను కూడా ఆయన పర్యవేక్షిస్తారు. మరో మంత్రి డాక్టర్ టి.కె. ప్రభుకు సహజ వనరుల శాఖను కేటాయించారు. ఖనిజాలు, గనుల శాఖల బాధ్యతలను ఆయనకు అప్పగించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Surya Kumar Yadav: ప్రధాని మోదీని కలిసిన టీ20 మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
Mandodari | ట్రెండింగ్‌లో ‘రామాయణం’ మండోదరి.. రాణి గెటప్‌లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్!
Nutritional Products | పోషకాహార ఉత్పత్తులను తీసుకునే ముందు జాగ్రత్త.. అప్రమత్తంగా ఉండాలంటున్న నిపుణులు..
Devireddy Sudheer Reddy | కేసీఆర్‌పై కక్షతోనే కాళేశ్వరం మరమ్మతులు చేయలేదు.. రేవంత్ రెడ్డిపై సుధీర్ రెడ్డి ఫైర్
Rakul Preet Singh | భారతీయురాలిగా గర్విస్తున్నా.. ‘రామాయణ’ గురించి రకుల్ ప్రీత్‌సింగ్ ప్రత్యేక పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

