Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Speaker Sets Deadline | తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరిన అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగించేందుకు అసెంబ్లీ స్పీకర్ ఒక గడువును విధించారు. ఆ ఎమ్మెల్యే అనర్హత వ్యవహారంపై నవంబర్ 17న తుది వాదనలు జరుగనున్నాయి.
చెన్నై: తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకేలో చేరిన అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ ముగించేందుకు అసెంబ్లీ స్పీకర్ ఒక గడువును విధించారు. ఆ ఎమ్మెల్యే అనర్హత వ్యవహారంపై నవంబర్ 17న తుది వాదనలు జరుగనున్నాయి. (Speaker Sets Deadline) అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత విచారణను రెండు నెలల్లోగా ముగించాలని మద్రాస్ హైకోర్టు ఇటీవల స్పీకర్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారి అనర్హత పిటిషన్లపై విచారణ కోసం స్పీకర్ ఒక షెడ్యూల్‌ను ఖరారు చేశారు. పిటిషనర్లు, ప్రతివాదులు తుది ప్రతివాదనలు, సమాధానాలు, పత్రాలను అక్టోబర్ 26న సమర్పించాలి. ఇరుపక్షాలు తమ రుజువు అఫిడవిట్లు లేదా సాక్ష్యాధారాల అఫిడవిట్లను నవంబర్ 2న సమర్పించాలి. ఇరుపక్షాల సాక్షులను వారి తరపు న్యాయవాదుల సమక్షంలో విచారించేందుకు నవంబర్ 10, 11, 12 తేదీలను నిర్ణయించారు. నవంబర్ 17న తుది వాదనలను స్పీకర్ వింటారు. ఆ తర్వాత తీర్పు వెలువడుతుంది. అయితే తుది తీర్పు వెలువడే తేదీని ఈ షెడ్యూల్లో పేర్కొనలేదు.
కాగా, సీఎం విజయ్ ప్రభుత్వం బలపరీక్ష సందర్భంగా 25 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ పార్టీ విప్‌ను ధిక్కరించారు. మైనారిటీ టీవీకే ప్రభుత్వానికి అనుకూలంగా వారు ఓటు వేశారు. అయితే వీరిలో 19 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అనంతరం పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీంతో వారిపై దాఖలు చేసిన అనర్హత పిటిషన్లను ఆ పార్టీ ఉపసంహరించుకున్నది. మిగిలిన ఆరుగురు అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి అధికార టీవీకేలో చేరారు.
అయితే అనర్హత పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ ఆరుగురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించారు. అన్నాడీఎంకే దీనిపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. మరో ఇద్దరు రెబల్ ఎమ్మెల్యేలైన డాక్టర్ ఆర్ విజయభాస్కర్, ఎం ఆర్ విజయభాస్కర్‌లకు కూడా సాంకేతికంగా పార్టీ నుంచి క్షమాభిక్ష లభించింది. అయినప్పటికీ వారిద్దరూ పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆరుగురు ఎమ్మెల్యేలలో నలుగురిపై మాత్రమే స్పీకర్ విచారణ జరుపవచ్చని తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
Speaker Sets Deadline | టీవీకేలో చేరిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు.. గడువు విధించిన స్పీకర్
Tiger Shroff | నేరస్థులను చూస్తే నవ్వొస్తుంది.. టైగర్ ష్రాఫ్ ఘటనపై ఆర్జీవీ రియాక్షన్
Allu Arjun | అల్లు అర్జున్ ఒక్క పోస్ట్‌తో మళ్లీ మొదలైన మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్ వార్.. రజినీకాంత్‌పై ప్రశంసలే కారణమా?
Stock Market | నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 125 పాయింట్లు పతనం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

