CM Vijay | మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం.. ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దంటూ కేంద్రాన్ని కోరిన సీఎం విజయ్
CM Vijay : కర్ణాటక ప్రభుత్వం చేపట్టనున్న మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారం దీనిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, తీర్మానానికి మద్దతు తెలిపాయి.
CM Vijay : కర్ణాటక ప్రభుత్వం చేపట్టనున్న మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారం దీనిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, తీర్మానానికి మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం జోసెఫ్ విజయ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదని కోరారు. అన్ని అనుమతుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
డ్యామ్ నిర్మాణానికి అనుకూలంగా కేంద్రం ఎలాంటి పర్యావరణ, సాంకేతిక, పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వకూడదని తీర్మానంలో పేర్కొన్నారు. కావేరి నదిపై ఎలాంటి కొత్త నిర్మాణం చేపట్టకూడదంటూ దీర్ఘకాలికంగా తమిళనాడు అనురిస్తున్న వైఖరికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయ్ స్పష్టం చేశారు. కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు డ్యామ్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది. దీనివల్ల తమకు నష్టం జరుగుతుందని తమిళనాడు వాదిస్తోంది. ఇప్పటికే కావేరి నదీ జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఈ అంశంపై 2007 ఫిబ్రవరిలో కావేరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్, 2018లో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేశాయి.
నదీ జలాల వాడకం, పంపకం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదురుస్తూ ఆదేశాలిచ్చాయి. ఈ ఆదేశాల ప్రకారమే రెండు రాష్ట్రాలకు సంబంధించి కావేరి నది నుంచి ఎవరి వాటా వాళ్లకు దక్కాలి. అయితే, డ్యామ్ నిర్మాణం వల్ల తమ వాటా తగ్గిపోతుందని తమిళనాడు వాదిస్తోంది. దీనిపై తాజా తీర్మానంలో కీలక అంశాల్ని ప్రస్తావించారు. ఇప్పటికే కావేరి నది నీళ్లలో లోటు కనిపిస్తోందని అసెంబ్లీ పేర్కొంది. నీళ్లు తమిళనాడుకు ఉన్న హక్కు, సహజ వనరు అని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని సీఎం విజయ్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trishula Snanarchana | వేయిస్తంభాల ప్రాచీనకోనేరులో త్రిశూలస్నానార్చన
Theft Attempt | దొంగతనం చేసేందుకు సీసీ కెమెరాను బ్లర్ చేశారు.. కానీ ఏమైందో చూడండి.. వీడియో
AP News | ఏపీలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ వర్గీయుల బాహాబాహీ..!
‘ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు అధిక ఆదాయం’
Pushkar Singh Dhami | ఉత్తరాఖండ్‌లో మద్రాసాలలో శుక్రవారం సెలవు రద్దు.. ఇకపై ఆదివారమే సెలవు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!

